అబద్ధాల పునాదులపై కూటమి రాజకీయాలు | - | Sakshi
Sakshi News home page

అబద్ధాల పునాదులపై కూటమి రాజకీయాలు

Feb 8 2026 3:50 AM | Updated on Feb 8 2026 3:50 AM

అబద్ధాల పునాదులపై కూటమి రాజకీయాలు

అబద్ధాల పునాదులపై కూటమి రాజకీయాలు

అబద్ధాల పునాదులపై కూటమి రాజకీయాలు

ఆమదాలవలస: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌ చదువుతూ మీడియా ముందు అవాస్తవాలు మాట్లాడటం ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు తగదని ఆమదాలవలస వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ అన్నారు. అంతరాత్మను ఆయన ప్రశ్నించుకొని మాట్లాడితే బాగుంటుందని హితవుపలికారు. ఎమ్మెల్యే కూన రవికుమార్‌ విజయవాడలో చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుమ ల లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన నీచమైన రాజకీయాలు సీబీఐ విచారణతో బట్టబయలయ్యాయన్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డా రు. అబద్ధాల పునాదులపై కూటమి రాజకీయం చేస్తోందన్నారు. ఈ మహా పాపాన్ని టీడీపీ క్యాడర్‌ కు అందరికీ అంటిస్తున్నారని, అందులో భాగంగా నే స్క్రిప్ట్‌ చదువుతున్నారని దుయ్యబట్టారు. తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ప్రచారం చేసినందుకు భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పా లని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ మున్సిప ల్‌ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాస్‌, సోషల్‌ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శి బొడ్డేపల్లి వెంకట సత్యం, డకరవలస పంచాయతీ సర్పంచ్‌ సురవరపు తిరుప తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement