పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ

Feb 8 2026 3:50 AM | Updated on Feb 8 2026 3:50 AM

పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ

పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ

పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నిర్వహిస్తున్న ఫారెస్ట్‌ బీట్‌ అధికారి, అసిస్టెంట్‌ బీట్‌ అధికారి, దేవదాయ శాఖ ఎగ్జిక్యూ టివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 3, తానేదర్‌ ఇన్‌ ఎ.పి. ఫారెస్ట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 11 వర కు జరిగే ఈ పరీక్షలకుఅభ్యర్థులు హాల్‌ టికెట్‌, ఒరిజినల్‌ ఏదైనా ఒరిజినల్‌ గుర్తింపు కార్డుతో హాజరుకావాలని కోరారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, ఎచ్చెర్లలోని అంబేడ్కర్‌ యూనివర్సిటీ కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 1375 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, కాలేజీ ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement