కొత్త ఉపాధి చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హమీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ అనే కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సనపల అన్నాజీరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏఐసీసీ, పీసీసీ పిలుపుమేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి గాదం వెంకట త్రినాథరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.


