విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
కొత్తూరు: మెట్టూరు బీసీ కాలనీలో నివాసముంటున్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ముండూరు ప్రకాశరావు(55) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశరావు కొద్దిరోజులుగా ఉప్పరపేటలోని నూతన గృహంలో వైరింగ్ పనులు చేస్తున్నాడు. శుక్రవారం వైరింగ్ చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రకాశరావును 108 అంబులెన్సులో స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రకాశరావుకు భార్య జానకి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ టి.తిరుపతిరావు తెలిపారు.


