చేతి రాత.. మార్చేను భవిత..!
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
● పరీక్షల్లో చేతిరాత కూడా ముఖ్యమే
● దస్తూరిపైనా సాధన చేయాలంటున్న నిపుణులు
కాశం కూడా లేకపోలేదు. విద్యార్థులు చేతిరాతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. టెన్త్ పరీక్షలకు నెలకుపైగా సమయం ఉన్నందున విద్యార్థులు ప్రతి రోజు అరగంట చేతిరాతపై సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
హిరమండలం:
మా అబ్బాయి బాగానే చదువుతున్నా మార్కులు ఆ స్థాయిలో రావడం లేదు.ఎందుకో అర్థం కావడం లేదంటూ కొందరు తల్లిదండ్రులు నిత్యం ఆవేదన చెందుతుంటారు.. నాకొచ్చినవన్నీ సరిగ్గానే రాశాను.. అయినా మంచి మార్కులు రాలేంటూ విద్యార్థులు వాపోతుంటారు .ఆశించిన మార్కులు తగ్గడానికి అందంగా రాయకపోవడం, రాయలేకపోవడం కూడా ఓ కారణమే. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాల్సిన అవసరాన్ని గుర్తించే తరుణమిది. ఎంతబాగా చదివినా సరైన సమాధానం రాయకపోవడంతో పాటు అందమైన చేతిరాత కూడా ఎంతో ముఖ్యం. దస్తూరి సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు, ఇది వరకే మంచిమార్కులు సాధించిన విద్యార్థులు సూచిస్తుచెబుతున్నారు.
వారికి అర్ధమైతేనే..
పరీక్ష రాసే విద్యార్ధుల చేతిరాత బాగుంటే మూల్యాంకనం చేసేవారికి సులువుగా అర్ధమవుతుంది. ఫలితంగా మంచి మార్కులు వేస్తారు. చేతిరాత బాగాలేకపోతే మూల్యాంకనం చేసేవారికి సమాధానం ఒక్కోసారి అర్ధం కాదు. ఫలితంగా మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం మార్కులపై ప్రభావం చూపి ర్యాంకు తగ్గే అవ
సంగ్రహక శక్తి ఎంత ఉన్నా అర్ధవంతంగా రాయడమే ప్రధానం. ఎక్కువ రాయాలన్న తపనతో సమయాన్ని వృథా చేసుకోకుండా చూసుకోవాలి. బాగా వచ్చిన జవాబును అందంగా రాస్తే మంచి మార్కులు సులభంగా వస్తాయి. – కె.రాంబాబు,
మండల విద్యాశాఖాధికారి, హిరమండలం
చక్కటి చేతిరాత సాధనతోనే సాధ్యమవుతుంది. పరీక్షలకు ఇంకా సమయం ఉన్నందున విద్యార్థులు అక్షరాలను గుండ్రంగా రాసేందుకు సమయం కేటాయించి సాధన చేయాలి. – ఎస్.కృష్ణవేణి,
కేజీబీవీ ప్రత్యేకాధికారి, హిరమండలం
మొదటి జవాబులు స్పష్టంగా రాయాలి. సమయం మించిపోతుందన్న ఆందోళన వద్దు.
రెండు వరసల మధ్య ఖాళీ వదలాలి. పదాలు అంటుకున్నట్లు కాకుండా ప్రతి అక్షరం వీలైనంతలో ఒకే పరిమాణంలో రాయాలి.
పెన్ను గట్టిగా పట్టుకుని రాయడం మంచిదికాదు. కొట్టివేతలు, దిద్దుబాటులు మంచివి కాదు.
చిత్రాలు ఉంటే వాటిని ఆకట్టుకునేలా శీర్షికలు, ఉప శీర్షికలు స్పష్టంగా కనిపించేలా రాయాలి.
గణితంలో సూత్రాలు, సమీకరణాలు కనిపించేలా రాయాలి.
పేజీ పైభాగంలో అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్లు విడిచిపెట్టాలి.
బుక్‌లెట్‌లో వాక్యాలు పైకి, కిందకు లేకుండా వరస క్రమంలో ఉండాలి.
పరీక్షల సమయంలో విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. లేకుంటే ఆ ప్రభావం చేతిరాతపై కూడా పడుతుంది.
చేతి రాత.. మార్చేను భవిత..!
చేతి రాత.. మార్చేను భవిత..!
చేతి రాత.. మార్చేను భవిత..!
చేతి రాత.. మార్చేను భవిత..!


