9 నుంచి టీటీడీ కల్యాణోత్సవాలు
శ్రీకాకుళం కల్చరల్ : తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కల్యాణాల ప్రాజెక్టులో భాగంగా ఈ నెల9 నుంచి 11 వరకు పలుచోట్ల కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం అసిస్టెంట్ జె.శ్యామసుందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఇచ్ఛాపురం మండలం బరంపురం ప్రాథమిక పాఠశాల ఆవరణలో, 10వ తేదీ ఉదయం 11 గంటలకు కళింగపట్నంలోని మత్స్యనారాయణ స్వామి ఆలయ సాగర తీరంలో, 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీకాకుళం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులంతా పాల్గొనాలని కోరారు.
శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌గా కూర్మారావు
శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌గా హనుమంతు కూర్మారావును నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో కమిషనర్‌గా పని చేసిన ప్రసాదరావును రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈయన స్థానంలో కూర్మారావును నియమించారు. ప్రస్తుతం ఈయన ఆగ్రోస్ జనరల్ మేనేజర్‌గా మంగళగిరిలో పనిచేస్తున్నారు. గతంలో శ్రీకాకుళం డ్వామా పీడీగా వ్యవహరించారు. అప్పట్లో శ్రీకాకుళం జిల్లా ఉపాధి హామీ పనులు అమల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం, జాతీయ స్థాయిలో మూడో స్థానం దక్కించుకుంది. ఈయన సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా కూర్మారావు ‘సాక్షి’తో మాట్లాడుతూ నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
నైరా కళాశాల సందర్శన
శ్రీకాకుళం రూరల్: నైరాలోని ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ కళాశాలను అగ్రికల్చర్ యూనివర్సిటీ (ఏఎన్‌జీఆర్‌ఏయూ, లామ్ గుంటూరు) వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్.శారదా జయలక్ష్మి దేవి, డీన్ ఆఫ్ పీజీ స్డడీస్ డాక్టర్ ఎ.వి.రమణ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల గ్రంథాలయం, డిజిటల్ లైబ్రరీని సందర్శించి మౌలిక సదుపాయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరిశోధన అంశాలపై చర్చించారు. నైరా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జి.జోగినాయుడు మాట్లాడుతూ విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ వి.శ్రీనివాసరావు, అసోసియేట్ ప్రొఫెసర్ లైబ్రరీ ఇన్‌చార్జి, ఓఎస్‌ఏ డాక్టర్ ఎస్.గోవిందరావు, పీడీ పురుషోత్తమరావు, సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్ వై.కుశరాజు తదితరులు పాల్గోన్నారు.
9 నుంచి టీటీడీ కల్యాణోత్సవాలు


