హామీలను డైవర్ట్ చేసేందుకే లడ్డూ నాటకం
కొత్తూరు: సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజలు నుంచి వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే పవిత్రమైన తిరుమల లడ్డూ పేరుతో నాటకం ఆడుతున్నారని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు. కొత్తూరు మండలం ఉప్పరపేటలో ఆమె విలేకరలతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ సిట్ వేసిన దర్యాప్తులో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించ లేదని తేల్చినా రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీ వేయడం సిగ్గుచేటన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే కూటమి పాలకులు ఇటువంటి చులకన రాజకీయాలకు ఒడిగడుతున్నారని విమర్శించారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు గండివలస ఆనందరావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ, సర్పంచ్ చిన్నమ్మడు, ఎంపీటీసీ సభ్యుడు వనుము లక్ష్మినారాయణ, ధర్మారావు, బాలకృష్ణ, సాధుబాబు, నాయకులు అగతమూడి నాగేశ్వరరావు, గుడబండి పోలయ్య, రాఘవ, పూర్ణ, గోవిందరావు పాల్గొన్నారు.


