ఐకమత్యంతోనే సంఘ బలోపేతం
జి.సిగడాం/శ్రీకాకుళం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన సీఎన్‌సీ(ఉడ్ కార్వింగ్ ) యూనియన్ సభ్యులు ఐత్యమత్యంతో మెలిగి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి ధనుంజయాచారి పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో సీఎన్‌సీ యానియన్ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణులే సీఎన్‌సీ మిషన్లు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు. సంఘ సభ్యుల సంక్షేమానికి అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం సీఎన్‌సీ యజమానుల సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా సింహాద్రి గణపతి ఆచారి(నరసన్నపేట), సింహాద్రి కేశవరావు ఆచారి (కోటబొమ్మాళి), అరసవిల్లి భద్రరావు ఆచారి(శ్రీకాకుళం), జిల్లా అధ్యక్షుడిగా పట్నాన బుజ్జి(కోటబొమ్మాళి), ఉపాధ్యక్షుడిగా అరసవిల్లి రాంబాబు(పొందూరు), ప్రధాన కార్యదర్శిగా అరసవిల్లి గోపాల్ వెంకటరమణ(ఎల్‌ఎన్‌పేట), కోశాధికారిగా సింహాద్రి వెంకటరమణ చాచారి(బుడితి), ఉప కోశాధికారిగా పేలూరు జగదీశ్వరరావు ఆచారి (పాలకొండ), కార్యదర్శిగా కొండూరు చిట్టిబాబు ఆచారి(నరసన్నపేట), సహాయ కార్యదర్శిగా మల్లవరపు హరికృష్ణ (వీరఘట్టం) ఎన్నుకున్నారు. కార్యక్రమంలో భవన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మంతిన హరినాథ్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.


