మహిళలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలి
పలాస: మహిళలపై హింస, ఉపాధి, మద్యం, డ్రగ్స్, పోర్న్ వెబ్‌సైట్‌లకు వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళా సంఘం పోరాటం చేస్తుందని ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అద్యక్షురాలు ఎం.లక్ష్మి పిలుపునిచ్చారు. పలాస మండలం బొడ్డపాడులో శుక్రవారం మహిళా సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా బదకల ఈశ్వరమ్మ, ఉపాధ్యక్షురాలిగా బి.చిన్నప్పన్నమ్మ, ప్రధాన కార్యదర్శిగా పోతనపల్లి కుసుమ, కార్యదర్శిగా జి.ప్రభావతి, కోశాధికారిగా బర్ల జానకి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కె.హేమక్క, కె.జానకమ్మ, ఎస్.రజనీ, కె.లత, ఈ.సరస్వతి, కె.సుహాసిని, ఎం.మహాలక్ష్మి, వంకల డిల్లేశ్వరిలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కుసుమ మాట్లాడుతూ ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ఇవ్వాలని, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథాతధంగా అమలు చేయాలని కోరారు. సమావేశంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు పాల్గొన్నారు.


