పీఆర్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ
అరసవల్లి : జిల్లా పంచాయతీరాజ్ మినిస్టీరియల్ సంఘం నూతన క్యాలెండర్‌ను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ గురువారం ఆవిష్కరించారు. జిల్లా మినిస్టీరియల్ సంఘ అధ్యక్షుడు కిలారి నారాయణరావు ఆధ్వర్యంలో సంఘ సభ్యులంతా కలిసి చైర్‌పర్సన్ బంగ్లాలో ఆమెను కలిసి ఉద్యోగుల పదోన్నతుల సమస్యలను ప్రస్తావించారు. అనంతరం క్యాలెడర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఉద్యోగులంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కింజరాపు నర్సింహమూర్తి, ఉపాధ్యక్షుడు ఇ.రఘు, సంఘ ప్రతినిధు లు పైడి నాగేశ్వరరావు, ఎస్.రమణ, వై.హిమవతి, ఉరిటి రమేష్, జి.లక్ష్మణరావు, ఎస్.రమణ, ఎ.ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.


