పంచాయతీల్లో కొత్త కుంపటి | - | Sakshi
Sakshi News home page

పంచాయతీల్లో కొత్త కుంపటి

Jan 9 2026 7:46 AM | Updated on Jan 9 2026 7:46 AM

పంచాయతీల్లో కొత్త కుంపటి

పంచాయతీల్లో కొత్త కుంపటి

● కొత్తగా 62 పంచాయతీల ఏర్పాటుకు సన్నాహాలు

● వైఎస్సార్‌సీపీ కంచుకోట గ్రామాలపై అధికార పార్టీ కుట్ర

● టీడీపీ అగ్రనేతల కనుసన్నల్లో ప్రణాళికలు

● అధికారుల వైఖరిపై మండిపడుతున్న పల్లెవాసులు

అరసవల్లి: పంచాయతీలకు విభజన సెగ తగలనుంది. కొద్ది రోజులుగా పలు గ్రామాలను, తండాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్ర భుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఈ మేరకు ఆయా విభజిత గ్రామాల ప్రజల నుంచి అభిప్రాయ సేకరణను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అశాసీ్త్రయంగానే విభజించేయాలని నిర్ణయించింది. దీంతో పల్లెల్లో పెద్ద పండుగ కాంతులు కాకుండా విభజన సెగలు రేగుతున్నాయి. ఐదేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 95 శాతం పల్లెలు వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచాయి. ఈ కంచుకోటలను ఎలాగైనా బద్దలు కొట్టాలని ప్రస్తుత అధికార పార్టీ పావులు కదుపుతోంది.

అంతా అశాసీ్త్రయంగానే..

2014 రాష్ట్ర విభజన అనంతరం జిల్లాలో పలు చోట్ల గ్రామ పంచాయతీల విలీనాలు, కొత్త పంచాయతీల ఏర్పాటు, తండాలను గ్రామ పంచాయతీలను చేయ డం జరిగింది. అలాగే వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలను సైతం పంచాయతీలుగా ఏర్పాటు చేసిన సందర్భాలున్నాయి. శాసీ్త్రయతను పాటిస్తూ, ప్రజాభిప్రాయాలను తీసుకుని జనాభా ప్రాతిపదిక న పంచాయతీలను ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలేవీ జరగడం లేదు. తూతూ మంత్రంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి, తాము అనుకున్న పంచాయతీలను విభజించి పాలించాలనే సూత్రాన్ని అనుసరిస్తూ టీడీపీ నేతలు కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రతిపాదనలను సిద్ధం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఇచ్చిన మార్గదర్శకాలను బట్టి గత నెలాఖరుకే పంచాయతీల విభజనలపై అభ్యంతరాలకు, ప్రతిపాదనలకు గడువు ముగిసింది. నిబంధనల ప్రకారం కనీసం 3 వేల జనాభా, 3 కిలోమీటర్ల విస్తీర్ణం, కనీస ఆదాయం రూ. 3 వేలు కలిగి ఉన్న పంచాయతీ హేమ్లెట్స్‌, అలాగే రెండు ప్రాంతాలను నదీ పరివాహక కాలువలు లేదా జాతీయ రహదారులు, ఇతరత్రా ప్రధాన కారణాల తో చెరో పక్క ఉన్న ఒకే ప్రాంతాలను విభజించి కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విభజన వెనుక కనిపిస్తున్న ఉద్దేశం మాత్రం రాజకీయమే.

జిల్లాలో మొత్తం 912 గ్రామ పంచాయతీలుండగా, అదనంగా మరో 93 చోట్ల పంచాయతీలను ఏర్పాటుకు పాలకులు ప్రతిపాదించాలని భావించినప్పటికీ, పలుచోట్ల ఫిర్యాదులతో పాటు గ్రామసభల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయకపోవంతో 62 కొత్త పంచాయతీలకు కొత్త ప్రతిపాదనలుగా జిల్లా పంచాయతీ అఽధికారి కార్యాలయం నుంచి పంచాయతీ రాజ్‌ కమిషనరేట్‌కు పంపించారు. ఇందులో వివిధ కారణాలతో 52 పంచాయతీల ప్రతిపాదనలను తిరిగి పంపించి, మరిన్ని పత్రాలతో తీసుకురావాల ని కమిషనరేట్‌ అధికారులు ఆదేశించారు. కాగా 10 వరకు పంచాయతీలను మాత్రం కొత్తగా ఏర్పాటు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చేసింది. జి.సిగడాం మండలం ఆనందపురం, నడిమివలస, సీతంపేట, సేతుభీమవరం, వెలగాడ, లావేరు మండలంలో గోవిందపురం, తాళ్లవలస, ఎల్‌ఎన్‌పేట మండలంలో చింతలబడవంజ, కరకవలస, పెద్ద కొల్లివలస తదితర పంచాయతీల విభజనకు మార్గం సుగమమమైంది. త్వరలో మిగిలిన పంచాయతీల పత్రాలను పరిశీలించిన తర్వాత వాటికి కూడా ఆమోదం లభించనుందని అధికారులు చెబుతున్నారు.

విభజనలపై ఫిర్యాదులు

జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలంలో 2, ఎచ్చెర్ల నియోజకవర్గంలో 16, ఇచ్ఛా పురం నియోజకవర్గంలో 10, నరసన్నపేట నియోజకవర్గంలో 10, పలాస నియోజకవర్గంలో 06, పాతపట్నం నియోజకవర్గంలో 11, శ్రీకాకుళం నియోజకవర్గంలో 02, టెక్కలి నియోజవర్గంలో అత్యధికంగా 36 చోట్ల అంటే మొత్తంగా 93 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటుకు అధికార పార్టీ నేతలు తెర వెనుక నుంచి ప్రతిపాదనలందేలా చర్యలు చేపట్టారు. అయితే చాలావరకు పంచాయతీల్లో విభజనకు స్థానికంగా గ్రామసభల్లోనే నిరసనలు వ్యక్తం కావడంతో వాటిపై ఫిర్యాదులతో పాటు గ్రామ తీర్మాణాలను సై తం అధికారికంగా ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇందులో మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో ఏకంగా 36 పంచాయతీల విభజనకు చెందిన ప్రతిపాదనలకు కేవలం రెండింటికే గ్రామాల నుంచి తీర్మాణాలు అందాయి. దీంతో మొత్తంగా ప్రతిపాదనలు 62కే పరిమితమయ్యాయి. జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం అన్నంపేట, జంగాలపా డు, డొంకలపర్త, నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం అంధవరం, అల్లాడ, లింగాలవలస, పోలాకి మండలం బొద్దాం, శ్రీకాకుళం మండలం పొన్నాం పంచాయతీల్లో విభజన ప్రక్రియపై నేటి వరకు గ్రామాల తీర్మాణాలు ఇవ్వలేదు. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం కొచ్చె ర్ల, నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలం కుమ్మరిగుంట, శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం వత్సవలసలలో పంచాయతీల విభజనపై ఇప్పటికే గ్రామ సభల్లో, పంచాయతీరాజ్‌ శాఖ కమీషనర్‌కు, అలాగే గ్రీవెన్స్‌లలో లిఖితపూర్వక ఫిర్యాదులు పంపించారు. పోలాకి మండలం పిన్నింటిపేటలో విభజనపై కొందరు కోర్టును ఆశ్రయించారు. అలాగే పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం చిన్నవంక, కిడిసింగి, మెట్టూ రు, పల్లివూరు, పాతపట్నం నియోజకవర్గం మెళి యాపుట్టి మండలం చీపురుపల్లి, జాడుపల్లి, కొత్తూరులలో గ్రామ పంచాయతీల విభజనకు పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం కాలేదు.

ప్రతిపాదనలు పంపించాం

నిబంధనల ప్రకారం గ్రామసభల్లో తీర్మా ణాలను బట్టి మొత్తం 62 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు దిశగా ప్రతిపాదనలను రాష్ట్ర కమిషనరేట్‌కు పంపించాం. అయితే కొన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు త్వరలో ఆమోదం పొందిన అనంతరం కొత్త పంచాయతీల ఏర్పాటుకు చర్యలు చేపడతాం.

– భారతీసౌజన్య, జిల్లా పంచాయతీ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement