పలాస జాతీయ రహదారిపై జీడిపిక్కల వ్యాన్ బోల్తా
వజ్రపుకొత్తూరు రూరల్: జాతీయ రహదారిలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ మొగిలిపాడు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. సోంపేట మండలం కొర్లాం నుంచి టెక్కలి వైపు జీడిపిక్కల లోడుతో వెళ్తున్న లగేజ్ వ్యాన్ టైర్‌లు పేలి మొగిలిపాడు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడగా జీడి పిక్కల బస్తాలు రోడ్డుపై పడి చెల్లాచెదురయ్యాయి. కాగా ఈ సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం త ప్పింది. అయితే ఈ సంఘటనతో కొంత సమ యం ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించా రు. అలాగే గాయపడిన డ్రైవర్‌ను పలాస ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డుపై బోల్తా


