అందుకోలేం
న్యూస్‌రీల్
శ్రీకాకుళం
పండగ సరే.. పైసలేవీ..?రథసప్తమి పండగ వచ్చేస్తోంది. కానీ ప్రభుత్వ నిధులివ్వడం లేదు. –IIలో
3
● కోనేం..
● జిల్లా మత్స్యకారులకు చిక్కని కోనేం
● సీజన్‌లో గంగపుత్రులకు నిరాశ
● కిలో రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతున్న ధర
శుక్రవారం శ్రీ 9 శ్రీ జనవరి శ్రీ 2026
గతం ఘనం..
ఒకప్పుడు మనకూ కోనేంలు విరివిగా దొరికేవి. వలలు మోయలేనంత బరువుతో గంగపు త్రులు కోనేం చేపలతో తీరానికి చేరేవారు. నాడు రూ.450 నుంచి రూ.650 వరకు ధర పలికిన కోనేం నేడు విశాఖ, ప్రధాన రేవుల్లో రూ.700 నుంచి రూ.వెయ్యి పలుకుతోంది. గతంలో ఇతర ప్రాంతాలకు సైతం ఎగుమతు లు జరిగేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. గత రెండేళ్లుగా జిల్లాలో సుమారు 760 టన్ను లు వరకు కోనేం చేపలు చిక్కగా ఈ ఏడాది సుమారు 160 టన్నులకే పరిమితమైంది.
ఫిషింగ్ హార్బర్లు కట్టాలి
ప్రధానంగా జిల్లాలో మంచినీళ్లపేట, భావనపాడు, బుడగట్లపాలెం ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలి. లోతుగా వేట సాగించేలా మత్స్యశాఖ సహకరించాలి. వలలు, మరబోట్‌లను సబ్సిడీపై అందించాలి.
– జి.దానయ్య, మత్స్యకారుడు, మంచినీళ్లపేట
చేపలు చిక్కడం లేదు
కోనేం చేప ప్రస్తుతం ధర ఎక్కువగా ఉంది. కానీ వలకు చిక్కడం లేదు. అడపా దడపా తప్ప టన్నుల్లో దొరకడం లేదు. వాతావరణమూ అనుకూలించడం లేదు. భావనపాడు హార్బర్ పూర్తయ్యి ఉంటే బాగుండేది. రెండేళ్లుగా తుఫాన్లూ పెరిగాయి. కోనేం, ట్యూనా, పండుగప్ప, సందువ లాంటి చేపలు చిక్కడం లేదు.
– డి.కొర్లయ్య, మత్స్యకారుడు, భావనపాడు
లోతుగా వేట సాగించాలి
మత్స్యకారులు డీప్ సీలోకి వెళ్తే కోనేం, ట్యూనా, సందువ లాంటి చేపలు దొరుకుతాయి. పైగా ప్రస్తుతం టెక్నాజీతో కూడిన వేట వల్ల చాలా మంది మత్స్యకారులు మత్స్య సంపదను అధికంగా చేజిక్కించుకోగలుగుతున్నారు. వలలు, బోట్లు కాలానుగుణంగా మార్చుకోవాలి. మత్స్యశాఖ అధికారుల నుంచి, టెక్నికల్ సూచనలు తీసుకోవాలి.
– వై.సత్యనారాయణ,
డీడీ మత్స్య శాఖ , శ్రీకాకుళం
అధికారులతో సమీక్షిస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్ విజయ
వజ్రపుకొత్తూరు:
జిల్లా మత్స్యకారులకు ఈ సీజన్‌లో నిరాశ తప్పడం లేదు. అధికంగా ధర పలికే కోనేం మన వలకు చిక్కలేదు. ప్రస్తుతం కోనేం ధర మటన్‌తో సమానంగా పెరుగుతోంది. కానీ చేప చిక్కకపోవడంతో జిల్లాలో ప్రధానంగా వేట సాగించే ఏడూళ్లపాలెం, బారువ, నువ్వలరేవు మంచినీళ్లపేట, భావనపాడు, బుడగట్లపాలెం, కళింగపట్నం తది తర రేవులు నిస్తేజంగా కనిపిస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ప్రధాన కారణమైతే, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం కాక, సముద్రంలో లోతుగా చేపల వేట(డీప్ సీ ఫిషింగ్) సాగక వీరు ఆదాయం కోల్పోతున్నారు.
ఫిషింగ్ హార్బర్లు ఉంటే..
193 కిలోమీటర్లు సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన సిక్కోలులో మత్స్య సంపదకు లోటు లేదు. కానీ అందుకు తగ్గట్టుగా మత్స్యకారుల వల్ల వసతులు లేవు. మెకనైజ్డ్ బోట్‌లతో డీప్ సీలో వేట సాగిస్తే తప్ప ఖరీదైన చేపలైన కోనేం, చందువ, పండుగ ప్ప, ట్యూనాలు చిక్కవు. హార్బర్లు ఉండి ఉంటే ఈ వేట సాగేది. ఇది గమనించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మన జిల్లాలో బుడగట్లపాలెం, మంచినీళ్లపేటల్లో ఫిషింగ్ హార్బర్లు నిర్మించేందుకు దాదాపు రూ.370 కోట్లు నిధులు మంజూరు చేసింది. కూట మి వచ్చాక ఆ పనులన్నీ దాదాపు ఆగిపోయాయి. దీనికి తోడు ఎప్పటికప్పుడు తుఫాన్లు విరుచుకుపడడంతో మత్స్యకారులకు నిస్తేజం తప్పడం లేదు.
వలసలే గతి..
వేటపై అధిక ఆదాయం వచ్చే మార్గాలు లేకపోవడంతో గంగపుత్రులు మళ్లీ కాండ్లా, గుజరాత్, చైన్నె, విశాఖపట్నం తదితర పట్టణాలకు వలసపోతున్నారు. అక్కడ ఫిషింగ్ హార్బర్‌లలో మరబోట్లు యజమానుల వద్ద కూలీలుగా చేపల వేటకు వెళుతున్నారు. జిల్లాలోనూ అటు ఇచ్ఛాపురం, బారువ నుంచి ఇటు రణస్థలం వరకు ఎక్కడా మత్స్యకారులకు అవసరమైన ఫిషింగ్ హార్బర్లు, మార్కెట్ సదుపాయం లేకపోవడంతో వలసే గతిగా మారుతోంది.
అందుకోలేం
అందుకోలేం
అందుకోలేం
అందుకోలేం
అందుకోలేం


