ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

Jan 9 2026 7:46 AM | Updated on Jan 9 2026 7:46 AM

ఆర్టీ

ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

సంక్రాంతికి

● అదనపు బస్సులు నడపనున్న ఆర్టీసీ అధికారులు

● నేటి నుంచి 12వ తేదీ వరకూ ప్రత్యేక సర్వీసులు

● ప్రత్యేక సర్వీసులకు సాధారణ చార్జీలే

శ్రీకాకుళం అర్బన్‌: సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. సుదూర ప్రాంతాలైన బెంగళూరు, తమిళనాడు, కర్ణాటక, మహా రాష్ట్ర, హైదరాబాద్‌, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరుకునే ప్రయాణికుల కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ సర్వం సిద్ధం చేస్తోంది. ప్ర త్యేక బస్సులకు ఎలాంటి అదనపు రుసుం వసూ లు చేయకుండా సింగిల్‌ఫేర్‌(యథావిది చార్జీలు)తోనే నడపనున్నారు. జిల్లాలోని 4 డిపోల పరిధిలో ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ విజయవాడ నుంచి శ్రీకాకుళం, టెక్కలి, పలాసకు ఆర్టీసీ అధికారులు అదనంగా 25 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేశారు.

విజయవాడ నుంచి..

విజయవాడ నుంచి శ్రీకాకుళంకు ప్రతి రోజూ యథావిధిగా 18 బస్సులకు అదనంగా 25 బస్సు లు నడపనున్నారు. అదేవిధంగా రాజమండ్రి నుంచి శ్రీకాకుళానికి యథావిధిగా తిరిగే 5 సర్వీసులకు అదనంగా మరో 2 బస్సులు వేశారు. అలాగే రావులపాలెం నుంచి 1, అమలాపురం నుంచి 2, కాకి నాడ, భద్రాచలంనకు ఒక్కో బస్సు చొప్పున రెగ్యులర్‌గా తిరిగేవి అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఆయా ప్రాంతాల నుంచి కూడా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

విశాఖపట్టణం నుంచి..

శ్రీకాకుళం జిల్లాకు విశాఖపట్టణం నుంచే ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇందుకోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి ప్రతిరోజూ 25 నాన్‌స్టాప్‌లు, 23 పల్లెవెలుగులు తిరుగుతున్నా యి. వీటితో పాటు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 9వ తేదీ, 10, 11, 12, 13వ తేదీ వరకూ విశాఖపట్టణం నుంచి శ్రీకాకుళం నకు ప్రతి రోజూ ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు చొప్పున నడపనున్నారు. జిల్లాలోనూ నాలుగు డిపోల పరిధి లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనంగా సర్వీసులు నడుపుతారు.

10 శాతం రాయితీ

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి సంస్థ రాయితీతో కూడిన ప్రయాణ చార్జీని ప్రవేశపెట్టింది. ఏసీ, సూపర్‌లగ్జరీ, అల్ట్రాడీలక్స్‌ వంటి సర్వీసులకు రాను, పోను ఒకేసారి టికెట్‌ తీసుకుంటే ప్ర యాణ చార్జీలో 10శాతం, ఈ–వాలెట్‌ ద్వారా బుక్‌ చేసుకుంటే 5శాతం రాయితీ ఇస్తున్నారు.

అన్ని చర్యలు తీసుకున్నాం

ఉచిత ప్రయాణం దృష్ట్యా ఈ ఏడాది అధిక రద్దీ ఉండవచ్చని అంచనా వేస్తున్నాం. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశాం. సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. తిరుగు ప్ర యాణానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశాం.

– సీహెచ్‌ అప్పలనారాయణ,

జిల్లా ప్రజా రవాణా అధికారి

ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు 1
1/1

ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement