ఆర్థిక సంఘం నిధులకు గండి
నగరపాలక సంస్థకు మూడు విడతలుగా పాలకవర్గం లేకపోవడంతో రూ.25 కోట్ల మేర 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రాలేదు. వీటిని రాబట్టేందుకు కూడా కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయకపోగా, నగరపాలక సంస్థపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. ఇప్పటికే నగరపాల క సంస్థ విద్యుత్ శాఖతో పాటు ఎంతోమందికి బకాయిలు పడగా అవి మరింత పెరిగి ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా అందించలేని స్థాయికి నగరపాలక సంస్థ దిగజారింది.
గత ఏడాది మూడు రోజులకు రూ.8 కోట్లకు పైగా ఖర్చు అయితే, ఈ ఏడాది ఏడు రోజులు జరిపితే ఇంకెంత ఖర్చు అవుతుందో ఊహించవచ్చు. జిల్లా ప్రజా ప్రతినిధులు ఇటువంటి వాటిని పరిగణనలోనికి తీసుకోకుండా పండగ లుగా ప్రకటించేసి నిధులు విదల్చకుండా చేతు లు దులుపుకొంటున్నారు. ఇప్పటికై నా పాలకు లు స్పందించి పాత బకాయిలు ప్రభుత్వం నుంచి రాబట్టడంతోపాటు రథసప్తమి నిర్వహణకు నిధులు మంజూరయ్యేలా చూడాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.


