రెండు ఆలయాల్లో చోరీలు
నరసన్నపేట: సత్యవరం పాదాలమ్మ తల్లి గుడి, దూకులపాడులోని జ్యోతి రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో బుధవారం రాత్రి దుండగులు చోరీలకు పాల్పడ్డారు. రెండు చోట్లా సీసీ కెమెరాలు ఉన్నా.. వాటి హార్డ్‌డిస్క్‌లు, డీవీఆర్‌లు కూడా ఎత్తుకుపో యారు. రూ.60 వేల వరకూ నష్టం జరిగినట్లు సమాచారం. దూకులపాడు శివాలయంలో అమ్మ వారి పుస్తెలు, ఉత్సవ విగ్రహాల ఆభరణాలు, హుండీ కొల్లగొట్టి నగదు పట్టుకుపోయారని పూజారి గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యవరం పాదాలమ్మ తల్లి ఆలయంలో విగ్రహాల ఆభరణాల ను పూజారి భద్రపరచడంతో పెద్ద నష్టమే తప్పింది. అయితే హుండీలో నగదు మాత్రం పట్టుకుపోయారు. పోలీసులు, క్లూస్‌టీమ్ ఆలయాలను పరిశీలించి వివరాలు సేకరించారు.


