గవర్నమెంట్‌ ప్లీడర్‌గా ఇప్పిలి | - | Sakshi
Sakshi News home page

గవర్నమెంట్‌ ప్లీడర్‌గా ఇప్పిలి

Jan 9 2026 7:46 AM | Updated on Jan 9 2026 7:46 AM

గవర్న

గవర్నమెంట్‌ ప్లీడర్‌గా ఇప్పిలి

గవర్నమెంట్‌ ప్లీడర్‌గా ఇప్పిలి సమీకృత కలెక్టరేట్‌ పనులు వేగవంతం చేయాలి రిటైర్డ్‌ ఉద్యోగుల డైరీ ఆవిష్కరణ వాటర్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ బిల్లులు చెల్లించకుంటే ఆత్మహత్యలే శరణ్యం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా కోర్టు గవర్నమెంట్‌ ప్లీడరు (జీపీ)గా సీనియ ర్‌ న్యాయవాది ఇప్పిలి తాతను ప్రభుత్వం నియమించింది. పోలాకి మండలం మబగాం గ్రామానికి చెందిన తాత నరసన్నపేటలో బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ప్రస్తు తం పలు బ్యాంకులకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఉన్నారు. ఈయనకు పదవి రావడం పట్ల జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తంగి శివప్రసా దరావు, ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు, సభ్యులు అభినందనలు తెలియజేశారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్ట ర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. గురువారం భవన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసంపూర్తిగా మిగిలిన పనుల వివరాలను ఎగ్జిక్యూ టివ్‌ ఇంజినీర్‌ సుగుణాకర్‌ను అడిగి తెలుసుకున్నారు.

శ్రీకాకుళం అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం డైరీ – 2026ను శ్రీకాకుళం ఎన్‌జీఓ హోమ్‌లో ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్ర జాయింట్‌ యాక్షన్‌ చైర్మన్‌ చౌదరి గురువా రం పురుషోత్తంనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ సంఘ ప్రతినిధులు పెన్షనర్ల ఇంటి వద్దకు కూడా వెళ్లి లైఫ్‌ సర్టిఫికెట్లు వంటి సేవలు అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రకాష్‌రావు మాట్లాడుతూ ఫిబ్రవరి 28వరకు ప్రతిరోజూ ఎన్జీవో హోంలో లైఫ్‌ సర్టి ఫికెట్లు ప్రక్రియ నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కె. సోమసుందరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్‌ ప్రసాదరావు, అసోసియేట్‌ అధ్యక్షుడు పి.నరసింహమూర్తి, కోశాధికారి కె.వెంకటేశ్వరరావు, సిటీ బ్రాంచ్‌ అధ్యక్షుడు బి.జానకిరామ్‌ పట్నాయక్‌, కార్యదర్శి ఎన్‌.ఎస్‌.పండా, కోశాధికారి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

మందస: మఖరజోల రహదారిపై పలాస నుంచి హైవేలో మొక్కలను తడుపుకుంటూ వెళ్తున్న వాటర్‌ ట్యాంకర్‌ను సోంపేంట నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ ముందుభాగం నుజ్జయ్యింది. క్యాబిన్‌లో ఇరుకున్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నేషనల్‌ హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్య లు చేపట్టారు. డ్రైవర్‌ను బయటకు తీసి పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలో అన్నీ శాఖలలో టెండర్‌ విధానంలో చేస్తున్న పనులకు ఏళ్ల తరబడి బిల్లులివ్వకపోవడంతో కాంట్రాక్టులకు ఆత్మహత్యలే శరణ్యమని సబ్‌కా శ్రీకాకుళం కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు జి.వి.రామానాయుడు అన్నారు. బ్యాంకులో డబ్బులు లేకుండానే బడ్జెట్‌ ఉందని చెప్పి.. తీరా పనులు చేయించాక డబ్బులు లేవని అధికారులు మొండిచేయి చూపిస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పండుగపూట కాంట్రాక్టులు, వారిపై ఆధారపడి ఉన్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. జిల్లాలో రూ.200 కోట్లు మేర బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు గ్రంధి వెంకటగణేష్‌ మాట్లాడుతూ శ్రీకాకుళం మున్సిపాల్టీలో పలుకుబడి ఉంటేనే బిల్లులు వస్తున్నాయన్నారు. సంఘ ప్రధాన కార్యదర్శి చల్ల సింహాచలం, కోఆర్డినేటర్‌ మొదలవలస ఆంజనేయులు, సంయుక్త కార్యదర్శులు యాళ్ల రామారావు, కిల్లి మోహనరావు, సభ్యులు తలగాపు సంతోష్‌ కుమార్‌, ఎం.రవికుమార్‌ పాల్గొన్నారు.

గవర్నమెంట్‌ ప్లీడర్‌గా ఇప్పిలి   1
1/4

గవర్నమెంట్‌ ప్లీడర్‌గా ఇప్పిలి

గవర్నమెంట్‌ ప్లీడర్‌గా ఇప్పిలి   2
2/4

గవర్నమెంట్‌ ప్లీడర్‌గా ఇప్పిలి

గవర్నమెంట్‌ ప్లీడర్‌గా ఇప్పిలి   3
3/4

గవర్నమెంట్‌ ప్లీడర్‌గా ఇప్పిలి

గవర్నమెంట్‌ ప్లీడర్‌గా ఇప్పిలి   4
4/4

గవర్నమెంట్‌ ప్లీడర్‌గా ఇప్పిలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement