పట్టుబడినా పట్టించుకోలేదు!
సీజ్ చేయలేదు..
● లెక్కకు మించిన ధాన్యంతో పట్టుబడిన రైస్‌మిల్ ● సీజ్ చేయాలని మంత్రి ఆదేశించినా పట్టించుకోని అధికారులు
శ్రీకాకుళం రూరల్ :
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 367 క్వింటాళ్లు (458 బస్తాలు) ధాన్యాన్ని శ్రీకాకుళం పరిధి లోని చింతాడ వద్ద చిట్టెమ్మ రైస్‌మిల్‌లో ఈ నెల 5న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేరుగా పట్టుకున్నారు. లెక్కకు మించి ధాన్యం ఉన్నందున సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అయినా ఇంతవరకు ఆయన ఆదేశా లు ఎవరూ పట్టించుకోలేదు. వాస్తవానికి, కెపాసిటీ కి మించి ట్రక్ షీట్‌లను నమోదు చేసినట్లు ఈ మిల్లులో గుర్తించారు. నవంబర్ నుంచి వేమెంట్ బ్రిడ్జి రికార్డుల ప్రకారం వెయ్యికు పైగా ట్రక్‌షీట్‌లు చిట్టెమ్మ రైస్‌మిల్‌లో నమోదు చేసినట్లు తేల్చారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం బస్తాల లెక్కలతోనే సరిపెట్టారు తప్ప కనీసం చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
అతి తక్కువకే కొనుగోలు..
వాస్తవంగా ఈ–క్రాప్ చేసిన పంట భూముల ధా న్యాన్నే మిల్లర్లు కొనుగోలు చేయాలి. ఇక్కడ మా త్రం పోరంబోకు భూములు, డిపట్టా భూములు, ఇనామి భూముల్లో పండించిన ధాన్యాన్ని అతి త క్కువ ధరకే రైతుల వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం. టార్గెట్‌కు మించిన ధాన్యం మిల్లులో గుర్తించినా చర్యలు చేపట్టకుండా ఓ అధికారి పావులు కదిపినట్లు తెలుస్తోంది.
చిట్టెమ్మ రైస్‌మిల్లులో అదనంగా 367 క్వింటాళ్ల ధాన్యం గుర్తించాం. దీనిపై రిపోర్టు రాసి ఉన్నతాధికారులకు పంపించాం. మిల్లును సీజ్ చేయలేదు. మిల్ యాజమాన్యం నవంబర్ నుంచి డిసెంబర్ వరకే రికార్డులు చూపించా రు. జనవరి నుంచి ఎటువంటి రికార్డులు నమోదు చేయలేదు.
– పైడి అనిల్‌కుమార్, సివిల్ సప్లయ్ అధికారి


