రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
నందిగాం: లట్టిగాం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి గురువారం మృతి చెందారు. కాశీబుగ్గ బ్రాహ్మణ వీధికి చెందిన సింహాద్రి సూర్యం(41) పలాస నుంచి టెక్కలి వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా లట్టిగాం వద్దకు వచ్చే సరికి కుక్క అడ్డం రావడంతో ఢీకొట్టి పడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో స్థానికులు టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యుల కోరికి మేరకు పలాస తరలించగా అక్కడ మృతి చెందాడు. సూర్యం భార్య మంగ ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్సై షేక్ మహమ్మద్ ఆలీ కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఒడిశా రాష్ట్రం రాయ్‌ఘడ్ జిల్లా గుణుపూర్‌కు చెందిన ఓ కారు డ్రైవర్ అదృశ్యమయ్యాడు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 7న గుణుపూర్‌కు చెందిన లోక్‌నా థ్ మిశ్రో కుటుంబం వైద్య చికిత్స నిమిత్తం నగరంలోని ఓ వైద్యుని వద్దకు వచ్చారు. భోజనం నిమి త్తం ఓ హోటల్‌కు వెళ్లి తిరిగి ఆసుపత్రికి సాయంత్రం 3.45 గంటలకు చేరారు. వైద్యం ముగించుకుని డ్రైవర్ సుశాంత్‌కుమార్ జిన్నా (50)కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. కారు ఉన్నా మనిషి లేకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఫలితం లేకపోవడంతో రెండో పట్టణ పోలీసులకు శుక్రవారం ఫిర్యా దు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
శ్రీకాకుళం క్రైమ్: సోంపేట ఎస్‌ఐ బి.లోవరాజుకు వీఆర్‌కు పంపుతున్నట్లు జిల్లా పోలీసు శాఖ నుంచి గురువారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సుశాంత్‌కుమార్(ఫైల్)


