ఉత్సాహంగా అండర్–14 క్రికెటర్ల ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అండర్–14 బాలుర క్రికెట్ ఎంపికలు ఆరంభమయ్యాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలోని క్రికెట్ నెట్స్ వద్ద ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో మొదలైన ఈ సెలక్షన్స్ ట్రయల్స్‌కు జిల్లా నలుమూలల నుంచి 82 మంది క్రీడాకారులు హాజరై ప్రతిభ నిరూపించుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ ఇలా అన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 33 మందిని ప్రాథమికంగా గుర్తించారు. వీరిని ఫస్ట్ రౌండ్‌కు ఎంపిక చేశారు. వీరికి శుక్రవారం ఉదయం 9 గంటలకు చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం సెలక్షన్ మ్యాచ్‌లు నిర్వహించి తుది జాబితా వెల్లడిచేంచనున్నారు. సెలక్టర్లగా ఏసీఏ నుంచి ఆర్.విష్ణువర్ధన్‌రెడ్డి (తిరుపతి), పి.భాను ప్రకాష్‌రెడ్డి (నెల్లూరు) హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు, సిబ్బంది, కోచ్‌లు పాల్గొన్నారు.


