8 కేజీల గంజాయి స్వాధీనం
మందస: మండలంలోని హరిపురం గ్రామంలో మందస రోడ్డు రైల్వేస్టేషన్ వద్ద 8 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బుధవారం ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా గోలండా గ్రామానికి చెందిన జగన్నాథ్ బెహరా(23) రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీసులు పట్టుకున్నారు. జగన్నాథ్ బెహరా బరంపురం పట్టణంలో గంగా ప్రధాన్ అనే వ్యక్తి వద్ద నుంచి రూ.36,000లకు గంజాయి కొనుగోలు చేశాడు. ఆ గంజాయిని బెంగులూరులో ఉన్న నరేంద్ర అనే గంజాయి వ్యాపారికి ఇవ్వనున్నట్లు తెలిపాడు. దీంతో పోలీసులు అరెస్టు చేశాడు. కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతిరావు, మందస ఎస్‌ఐ కృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
పలాస: మండలంలోని బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన సాహు ఆనంద్, నీలిభద్ర గ్రామానికి చెందిన బెహరా రమేష్ అనే ఇద్దరు యువకులను గంజాయితో అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ తెలిపారు. వారి నుంచి 3.70 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ కేసులో మరో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారన్నారు. ఈ నలుగురు బ్రాహ్మణతర్లా పాఠశాలలో కలిసి చదువుకున్నారని, వీరంతా అప్పుడప్పుడు గంజాయి తాగడం, బరంపురం వెళ్లి ఒకరి వద్దనుంచి గంజాయి తీసుకొని వచ్చి అమ్మడం చేస్తుండేవారన్నారు. ఈ క్రమంలో గంజాయితో బ్రాహ్మణతర్లా నుంచి నడుచుకుంటూ వస్తుండగా పలాస మండలం కంబిరిగాం బ్రిడ్జి వద్ద కాశీబుగ్గ ఎస్‌ఐ నరిసింహమూర్తి, సీఐ వై.రామకృష్ణ, పోలీసు సిబ్బంది పట్టుకున్నారన్నారు. వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేయడం జరిగిందన్నారు. నిందితులను పలాస కోర్టులో హాజరుపరిచామని వెల్లడించారు.
8 కేజీల గంజాయి స్వాధీనం


