విద్యార్థులతో బాధ్యతగా వ్యవహరించాలి
ఇచ్ఛాపురం రూరల్: విద్యార్థులతో ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలే తప్పా.. కఠినతరమైన శిక్షలు అమలు చేయకూడదని ఎంఈవో–2 ఎస్.విశ్వనాథం అన్నారు. బూట్లు వేయలేదనే నెపంతో టెన్త్ విద్యార్థులను పాత శాసనాం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పైడి గోపాలరావు బయటకు గెంటేయడంతో మంగళవారం సాక్షి దినపత్రికలో ‘బూట్లు వేయలేదని టెన్త్ విద్యార్థుల గెంటివేత’ శీర్షికతో వచ్చిన కథనానికి విద్యాశాఖ స్పందించింది. బుధవారం ఎంఈవో–2 విశ్వనాథం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఇకపై విద్యార్థులపై ఇలాంటి చర్యలు తీసుకోకూడదంటూ సూచించారు. ప్రధానోపాధ్యాయుడితో లిఖిత పూర్వకంగా సంజాయిషీ పత్రాన్ని తీసుకున్నట్లు తెలిపారు.


