కొత్త బంగారు లోకం..
అడ్మిషన్లు భారీగా పెంచడమే లక్ష్యం
ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో పాఠాలు బోధించడంతోపాటు అన్ని వసతులు, సౌ కర్యాలతో విద్య అందిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, బ్యాగులతోపాటు మధ్యాహ్న భోజనం కూడా అమలవుతోంది. ఈ ఏడాది అడ్మిషన్లను భారీగా పెంచేందుకు ఇంటర్ విద్య ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.
– రేగ సురేష్ కుమార్, ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారి(డీఐఈవో), శ్రీకాకుళం
శ్రీకాకుళం న్యూకాలనీ:
జిల్లాలోని జూనియర్ కళాశాలలు సోమవా రం నుంచి పూర్తిస్థాయిలో పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ ఒకటి నుంచి సెకెండియర్ విద్యార్థులకు తరగతులు మొదలుపెట్టి, ఏప్రిల్ 7వ తేదీ నుంచి అడ్మిషన్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా పూర్తిస్థాయిలో కాలేజీలు తెరుచుకోవడంతోపాటు క్లాసులు మొదలుకానున్నాయి. దీంతో కళాశాలల్లో సందడి వాతావరణం నెలకొననుంది. ప్రైవేటు కాలేజీలు ఇప్పటికే తరగతులను మొదలుపెట్టేశాయి. జిల్లాలో మొత్తం 168 జూనియర్ కళాశాల లు ఉండగా.. ఇందులో 38 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. సెకెండియర్ విద్యార్థులు 20,410 మంది వరకు చదువుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇప్పటికే అధికారుల ఆదేశానుసారం అడ్మిషన్ డ్రైవ్స్ (క్యాంపెయినింగ్‌లు) నిర్వహించారు.
కాలేజీల్లో యోగాసనాలు..
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకుని నిర్వహిస్తున్న యోగాంధ్ర– 2025లో భాగంగా కాలేజీల్లో విద్యార్థులతో యోగసనాలను వేయించేలా ఇంటర్‌విద్య జిల్లా అధికారులు ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన పలు కాన్ఫెరెన్స్ కాల్ మీటింగ్‌లో సూచనలు చేశారు.
235 రోజులు పనిదినాలు..
వార్షిక క్యాలెండర్ ప్రకారం 2025–26 విద్యా సంత్సరానికి సంబంధించి జూనియర్ కళాశాలలు 235 రోజులు పనిచేయనున్నాయి. ఆఖరి పని దినంగా 2026 మార్చి 18గా నిర్ణయించారు. కొత్త విద్యా సంవత్సరంలో 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 18 వరకు మొత్తం 314 రోజులు ఉండగా ఇందులో ఇందులో 235 రోజులు కళాశాలలు పనిచేయనున్నాయి. మరో 79 రోజులు రెండో శనివారం, ఆదివారం, పండగలు, ఇతర సెలవు దినాలు ఉన్నాయి.
నేడు పునఃప్రారంభం కానున్న జూనియర్ కళాశాలలు
2025–26 విద్యా సంవత్సరం నేటి నుంచి మొదలు
జూన్ 21 వరకు యోగాంధ్రాలో భాగంగా ప్రతిరోజు కాలేజీల్లో యోగాసనాలకు చర్యలు
కొత్త బంగారు లోకం..
కొత్త బంగారు లోకం..


