స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించాలి | - | Sakshi
Sakshi News home page

స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించాలి

Mar 16 2025 1:36 AM | Updated on Mar 16 2025 1:36 AM

స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించాలి

స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించాలి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జి అధికారి శశిభూషణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జిల్లా వివరాలను కలెక్టర్‌ వివరించారు. బాహుదా ఓపెన్‌ హెడ్‌ చానల్‌, మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులు, మూలపేట పోర్టు, నదుల అనుసంధానం, హిరమండలం రిజర్వాయర్‌ తదితర పనుల పురోగతిపై చర్చించారు. డీసీహెచ్‌ డాక్టర్‌ కళ్యాణ్‌బాబు మాట్లాడుతూ కిడ్నీ వ్యాధులకు సంబంధించి కొరత లేకుండా మందులు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ షకీలా, ఎంవీఐ గంగాధర్‌, ఉపాధి పీడీ సుధాకర్‌, డీఎఫ్‌ఓ వెంకటేష్‌, మైన్స్‌ శాఖ డీడీ మోహనరావు, డీఆర్‌ఓ ఎం.వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు కృష్ణమూర్తి, ఉప కలెక్టర్లు పద్మావతి, అప్పారావు, లక్ష్మణమూర్తి, సివిల్‌ సప్లయ్‌ డీఎం వేణుగోపాల్‌, డీటీసీ ఎ.విజయ సారధి, ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ కృష్ణమూర్తి, భూగర్భ గనుల శాఖ డీడీ మోహనరావు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పి.వి.వి.డి.ప్రసాదరావు, డీఎస్‌ఓ సూర్యప్రకాష్‌, డ్వామా పీడీ సుధాకర్‌, జెడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, సీపీఓ లక్ష్మీప్రసన్న, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి.శాంతి శ్రీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఎహసాన్‌ భాషా, వ్యవసాయ శాఖ జేడీ త్రినాథస్వామి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ఇచ్ఛాపురం రూరల్‌: విద్యుత్‌ స్తంభాన్ని బైక్‌ ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొళిగాం గణేష్‌ బ్రిక్‌ ఇండస్ట్రీలో పనిచేస్తున్న రాజేష్‌ చవాన్‌(25) శనివారం స్నేహితుడితో కలిసి మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వెళ్తూ పాయితారి వద్ద విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టారు. రాజేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడు తీవ్ర గాయాలపాలవ్వడంతో స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఇ.శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారు ఒడిశా, బీహార్‌ ప్రాంతాలకు చెందిన వారని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement