‘క్వారీలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ..?’
టెక్కలి: గ్రానైట్ క్వారీలు ప్రారంభించినపుడు ఉన్న శ్రద్ధ ఆ తర్వాత ఆయా గ్రామాల అభివృద్ధిపై చూపడం లేదని టెక్కలి మండలం ఆంజనేయపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశా రు. ఆంజనేయపురం గ్రామానికి ఆనుకుని అడ్డుకొండ సర్వే నంబర్‌లో హెరిటేజ్ గ్రానైట్ క్వారీ ఏర్పాటు, అర్చనా గ్రానైట్ క్వారీ విస్తరణకు సంబంధించి మంగళవారం ప్రజాభిప్రా య సేకరణ నిర్వహించారు. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కరుణశ్రీ, మైన్స్ ఏడీ విజయలక్ష్మి, తహసీల్దార్ బి.సత్యం సమక్షంలో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. మేఘవరం పంచాయతీ పరిధిలో క్వారీలు ఉన్నప్పటికీ ఆ క్వారీల వల్ల తమ గ్రామంలో ఇబ్బందులు తలెత్తుతున్నా యని గుర్తు చేశారు. స్థానికంగా ఉన్న కార్మికులకు కాకుండా ఒడిశా నుంచి కార్మికులకు తీసుకురావడం వల్ల పనులకు ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. గ్రామంలో కనీసం ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ కూడా లేని దుస్థితిలో ఉన్నామన్నారు. గ్రామంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంత రం ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇటీవల మెళియాపుట్టి ప్రాంతంలో గ్రానైట్ క్వారీల్లో చోటు చేసుకున్న సంఘటనల్లో గా యపడిన వారిని కనీసం పట్టించుకోలేదన్నా రు. ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ క్వారీ లకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో అభివృద్ధి చర్య లు చేపట్టే విధంగా ఆయా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు.
జవాబుదారీతనంతో పనిచేయండి: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పడితే సహించేది లేదని, విధుల్లో బాధ్యతారాహిత్యం ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని, ప్రజలకు సేవ చేయాల్సిన వారు మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్ల దగ్గర నుంచి బయోమెట్రిక్ వరకు అన్నీ సక్రమంగా ఉండాల్సిందేనని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మంగళవారం సాయంత్రం మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వైద్యారోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది మెడికల్ ఆఫీసర్లు బాధ్యతగా వ్యవహరించడం లేదని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. డిప్యూ టీ డీఎంహెచ్‌ఓలు వారం రోజుల్లోగా జిల్లాలో ని 71 పీహెచ్‌సీలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 6,400 మంది సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ సూచించారు.
అన్నీ ఈ–ఆఫీస్ ద్వారానే
ప్రభుత్వ పరిపాలనలో ’ఈ–ఆఫీస్’ అమలును అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇకపై ఫైళ్లన్నీ ఈ–ఆఫీస్ ద్వారానే జరగాలని, కాలయాపన చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఆదాయం పెంచేలా చూడాలని సూచించారు. నివాస స్థలాల పట్టాల పంపిణీకి ఖాళీ ప్లాట్ల వివరాలు సిద్ధం చేయాలని, పంచాయతీ భవనాల నిర్మాణానికి స్థలాలు సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
‘క్వారీలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ..?’


