రథసప్తమికి పటిష్ట బందోబస్తు
శ్రీకాకుళం క్రైమ్ : అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలకు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం పోలీసు అధికారులతో సమీక్షా నిర్వహించారు. పోలీసులు ఆలయ, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్తు, వైద్య శాఖల అధికారులతో సమన్వయం పాటించాలన్నారు. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న వేడుకల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వర్తించాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, హెలిప్యాడ్ భద్రత, పార్కింగ్ ఏర్పాట్లు, క్యూలైన్, బారికేడ్ల నిర్వహణపై ఎస్పీ చర్చించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు కె.వి.రమణ, పి.శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, ఽశ్రీకాకుళం సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


