సారా ప్యాకెట్లతో ఐదుగురు అరెస్టు
కంచిలి/సోంపేట: కంచిలి, మందస మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఎకై ్సజ్ సిబ్బంది జరిపిన దాడుల్లో మొత్తంగా 590 నాటుసారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని, ఐదుగురిని అరెస్టు చేసి, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సోంపేట ఎకై ్సజ్ సీఐ జీవీ రమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంచిలి మండలం ఎంఎస్ పల్లి గ్రామంలో పడాల నరసమ్మ నుంచి 100 నాటుసారా ప్యాకెట్లు, జలంత్రకోట గ్రామంలో రత్నాల అర్జున నుంచి 100 ప్యాకెట్లు, గొల్లకంచిలి గ్రామంలో దుబ్బ భీమయ్య నుంచి 300 నాటుసారా ప్యాకెట్లు, మందస మండలం శ్రీరాంపురం గ్రామంలో కొమర రాజులమ్మ నుంచి 5 లీటర్లు నాటుసారా, కొండలోగాం గ్రామంలోని సవర కుమారి నుంచి 40 నాటుసారా ప్యాకెట్లు పట్టుకొని అరెస్టు చేశామన్నారు. వీరితోపాటు వీరికి నాటుసారా సరఫరా చేసిన ఎం.ఎస్.పల్లి గ్రామానికి చెందిన బొండాడ మోహనరావు, కాలాపాణికి చెందిన నాయక్, తుట్టసాయికి చెందిన భయ్యా గొమాంగో మీద కూడా కేసు నమోదు వెల్లడించారు. అరెస్టు చేసినవారిలో ముగ్గురిని సోంపేట మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా, 14 రోజులు రిమాండ్ విధించారని తెలిపారు. ఈ దాడుల్లో సీఐ మధుకుమార్, ఎస్‌ఐలు జాన్ ప్రసాద్, కల్యాణి, సుజాత, సిబ్బంది కృష్ణ, మార్కారావు, ఉమాపతి, భాను, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.


