వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్‌సెల్‌లో ఇద్దరికి చోటు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్‌సెల్ సంయుక్త కార్యదర్శులుగా ఎచ్చెర్ల నియెజకవర్గానికి చెందిన మూగి శ్రీరాములు, ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన దుప్పల చలపతి నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం
టెక్కలి: ప్రభుత్వ వసతి గృహాల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనాలు అందజేయాల్సిందేనని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు స్పష్టం చేశారు. బుధవారం టెక్కలిలో ఎంజేపీ బాలికల పాఠశాల, బీసీ, ఎస్సీ, ఎస్టీ బాలికల కళాశాల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంజేపీ బాలికల పాఠశాలలో కూరగాయలు, ఇతర వంట సామగ్రి సరఫరా చేసే కాంట్రాక్టర్ సక్రమంగా సరుకులు సరఫరా చేయకపోవడంపై ఫోన్‌లో మండిపడ్డారు. ఇష్టమైతే కొనసాగాలని, లేకపోతే తప్పుకోవాలని హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న బీసీ బాలికల కళాశాల వసతి గృహాన్ని సందర్శించి భోజనాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై వార్డెన్ శ్రావణికి మెమో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ సూర్యప్రకాశ్, ఆహార నియంత్రణ అధికారి శ్రీరాములు, తూనికలు కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ బలరామకృష్ణ, సీఎస్‌డీటీ అనిల్, ఇన్‌చార్జి ఏబీసీడబ్ల్యూఓ త్రినాథరావు, ఏఎస్‌డబ్ల్యూఓ విజయలక్ష్మి , ఎంజేపీ పాఠశాలల కన్వీనర్ రత్నకుమారి, ప్రిన్సిపాల్ పి.సుధారాణి పాల్గొన్నారు.
దాడి అమానుషం
శ్రీకాకుళం క్రైమ్ : సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చుతూ టీడీపీ నాయకులు రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నారని.. దాని పర్యావసనమే టెక్కలిపాడు సర్పంచ్ ధర్మాన నీలవేణి భర్త ధర్మాన బువ్వాజీపై టీడీపీ వర్గీయుల దాడి అని వైఎస్సార్సీపీ యువనేత ధర్మాన కృష్ణచైతన్య అన్నారు. నరసన్నపేట మండలం టెక్కలిపాడు పంచాయతీ గొల్లపేటలో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్న బువ్వాజీపై దాడి జరిగిన విషయం తెలిసిందే. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బువ్వాజీని బుధవారం పరామర్శించారు. అనంతరం ఈ ఘటనలో బాధితునికి న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని కోరుతూ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ తాము అధికారంలో ఉండగా ఎలా పనులు చేయిస్తావ్ అంటూ టీడీపీ నాయకులు ప్రశ్నించడాన్ని తప్పుపట్టారు. టీడీపీ నాయకులు తీరు మార్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు వానగోపి, ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఆర్.అప్పన్న, డి.మన్మధరావు, కె.శేఖర్‌రావు, డి.జగన్మోహన్, జి.వెంకటరమణి, కె.సీతారాం, పి.విజయ్‌కుమార్, బి.ఈశ్వరరావు, బి.రాజశేఖర్, పి.గోవింద, ఎన్.రాజేశ్వరరావు, పి.రాజప్పలనాయుడు, ఎం.గోవింద, వి.గోవింద, టి.భార్గవ్, కె.ఆనంద్ తదితరులున్నారు.
బస్ స్టేషన్లు బాగుండాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆర్‌టీసీ కాంప్లెక్సు, బస్‌స్టేషన్లలో మరుగుదొడ్లు, ఇతర వసతులు బాగుండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ప్రజా రవాణా సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్, కండక్టర్ల ప్రవర్తన, బస్ స్టేషన్ పరిసరాలలో పరిశుభ్రత, సీటింగ్, వెయిటింగ్ ప్రాంతాల నిర్వహణ, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీ్త్ర శక్తి అమల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రజా రవాణాధికారి సీహెచ్.అప్పలనారాయణ, డిపో మేనేజర్లు ఎం.అమరసింహుడు, శర్మ, శ్రీనివాస్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్‌సెల్‌లో ఇద్దరికి చోటు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్‌సెల్‌లో ఇద్దరికి చోటు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్‌సెల్‌లో ఇద్దరికి చోటు


