యువ క్రికెటర్లకు చాన్స్
● నేడు, రేపు అండర్–14 జిల్లా స్థాయి సెలక్షన్ ట్రయల్స్
● ఎంపికై తే స్టేట్ లెవల్ ఎంపికకు అవకాశం
నెట్స్‌లో సాధన చేస్తున్న క్రీడాకారులు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఫ్యూచర్ క్రికెటర్ల గుర్తింపునకు జిల్లా క్రికెట్ సంఘం(జెడ్‌సీఏ) సమాయత్తమైంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) సౌజన్యంతో శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో మహిళల క్రికెట్ నెట్స్ వేదికగా గురు, శుక్రవారాల్లో అండర్–14 బాలుర విభాగంలో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇప్పటి కే ఏసీఏ నుంచి సెలక్షన్ కమిటీ ప్రతినిధులు జిల్లాకు చేరుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ (మీడియం పేస్/స్పిన్), కీపింగ్ విభాగాల్లో బాలురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. నిర్దేశిత ఎంపిక జాబితాలో అవకాశం లభిస్తే ప్రత్యేకంగా శిక్షణ అందించి మరింత ఉన్నతంగా ఫ్యూచర్ క్రికెటర్లను తీర్చిదిద్దనున్నారని జిల్లా క్రికెట్ సంఘం మెంటార్ ఇలియాస్ మహ్మద్ పేర్కొన్నారు. తెలుపు క్రికెట్ యూనిఫాం ధరించి హాజరుకావాలని, జనన ధృవీకరణ పత్రం, ఆధార్ ఒరిజినల్, జిరాక్స్‌కాపీలో ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలని సూచించారు.
ఏర్పాట్లు పూర్తిచేశాం..
యువ టాలెంట్ హంట్‌గా జిల్లా అండర్–14 బాలురుకు నిర్వహిస్తున్న ఈ ఎంపికలను శిక్షణ పొందుతున్న క్రీడాకారులంతా సద్వినియోగం చేసుకోవాలి. సెలక్షన్ ట్రయల్స్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం. – పుల్లెల శాస్త్రి,
జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు, శ్రీకాకుళం
సువర్ణ అవకాశం..
జిల్లా అండర్–14 సెలక్షన్ ట్రయ ల్స్ యువ క్రికెటర్లకు సువర్ణ అవకాశం. ఏసీఏ నుంచి సెలక్షన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. అత్యంత పారదర్శకంగా సెలక్షన్స్ జరుగుతాయి. – హసన్‌రాజా షేక్,
జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం
యువ క్రికెటర్లకు చాన్స్
యువ క్రికెటర్లకు చాన్స్


