నేడు మెగాజాబ్‌మేళా
కొత్తూరు: స్థానిక శ్రీవెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో బుధవారం మెగాజాబ్ మేళా నిర్వహించనున్నట్లు కాలేజీ చైర్మన్ గేదెల కృష్ణారావు మంగళవారం తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మేళాకు 10 కంపెనీలు హాజరవుతాయన్నారు. వివిధ కేటగిరీలకు చెందిన సుమా రు 360 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ, బీటెక్ అర్హత ఉన్న వారంతా అర్హులేనని, 18–35 ఏళ్ల వయసు గల వ్యక్తులు హాజరు కావాలని సూచించారు. మేళాకు విద్యార్హతతో పాటు ఆధార్‌కార్డు, ఫొటోలు తీసుకురావాలని సూచించారు.


