నన్ను చంపడానికే వచ్చారు | - | Sakshi
Sakshi News home page

నన్ను చంపడానికే వచ్చారు

Jan 7 2026 7:49 AM | Updated on Jan 7 2026 7:49 AM

నన్ను

నన్ను చంపడానికే వచ్చారు

తలకు బలమైన గాయమైంది డాక్టర్‌ భార్గవ్‌ మాట్లాడుతూ బువ్వాజీ తలకు తీవ్రమైన గాయమైందని, సీటీ స్కాన్‌ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు. శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేస్తున్నామని వెల్లడించారు.

సర్పంచ్‌ భర్త, వైఎస్సార్‌ సీపీ నాయకుడు బువ్వాజీ

టీడీపీ వర్గీయుల దాడిలో తీవ్ర గాయాలు

నరసన్నపేట:

చివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో గొల్లపేటలో పారిశుద్ధ్య పను లు చేపడుతుండగా.. టీడీపీకి చెందిన అసిరినాయుడుతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు తనను చంపడానికే దాడి చేశారని, ఇప్పటికే చాలాసార్లు బెదిరించారని, ఒక్కడినే ఉండగా వచ్చి దాడి చేశారని టెక్కలిపాడు సర్పంచ్‌ నీలవేణి భర్త, వైఎస్సార్‌సీపీ నాయకుడు ధర్మాన బువ్వాజీ తెలిపారు. నరసన్నపేట ప్రభుత్వాస్పత్రి వద్ద ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కత్తులు, కర్రల తో దాడికి పాల్పడ్డారని, అడ్డుకోవడానికి ప్రయత్నించిన తమ్ముడు అచ్చెన్నపై కూడా దాడి చేశారని తెలిపారు. ‘పనులు చేయడానికి నీవెవరు’ అంటూ ప్రశ్నించారని, సర్పంచ్‌ భర్తగా పారిశుద్ధ్య పనుల వద్ద ఉండడం తప్పా అని అడిగారు. దీనిపై బువ్వాజీ సోదరుడు అచ్చెన్న మా ట్లాడుతూ పారిశుద్ధ్య పనులు చేస్తున్నప్పుడు వెనుకగా వచ్చి దాడి చేశారని, బువ్వాజీని హత్య చేయడమే వారి ఆలోచన అని తెలిపా రు. పారిపోతూ కూడా మీ అంతుచూస్తామ ని బెదిరించారని పేర్కొన్నారు. గ్రామస్తులు బండి జోగారావు, పిరియా పండువాడు, ధర్మాన లింగన్న తదితరులు స్పందిస్తూ టీడీపీ వాళ్లు కక్ష కట్టి ఇలా దాడి చేయడం దారుణమని అన్నారు. పంచాయతీ ప్రజలంతా బువ్వాజీకి అండగా ఉంటామన్నారు.

బువ్వాజీని పరామర్శిస్తున్న ధర్మాన కృష్ణదాస్‌ తదితరులు

దాడి అమానుషం

వైఎస్సార్‌సీపీ నాయకుడిపై మారణాయుధాలతో దాడికి పాల్పడడం అమానుషమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. బువ్వాజీ వివాదాలకు దూరంగా ఉంటారని, అలాంటి వ్యక్తిపై ఇలా దాడులు చేయడం తగదని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సూచించారు. సమాచారం తెలిసిన వెంటనే ఎస్పీతో మా ట్లాడానని చెప్పారు. స్వయంగా కలిసి కూడా దాడి గురించి వివరిస్తామన్నారు. బువ్వాజీకి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అంతకుముందు ఆస్పత్రిలో బాధితుడిని కలిసి పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కాళింగ విభా గం అధ్యక్షుడు ఆరంగి మురళి, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కేసీహెచ్‌బీ గుప్త, పార్టీ రైతు విభాగం రాష్ట కార్యదర్శి కనపల శేఖర్‌, పార్టీ నాయకులు బగ్గు రామకృష్ణ, ధర్మాన జగన్‌, రాజాపు అప్పన్న, బగ్గు రమణయ్య, నేతింటి రాజేశ్వరరావు, బీఎల్‌ శర్మ తదితరులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బువ్వాజీని ఆయన సోదరుడు అచ్చెన్నను పరామర్శించారు. అనంతరం వీరు మాట్లాడుతూ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

నన్ను చంపడానికే వచ్చారు 1
1/1

నన్ను చంపడానికే వచ్చారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement