డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

Oct 14 2024 1:28 AM | Updated on Oct 14 2024 1:28 AM

డీఎస్

డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: డీఎస్సీ రాయనున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహన్‌ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు మూడు నెలల పాటు శిక్షణ పొందేందుకు ఈ నెల 21 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. http:jnanabhumi.ap.gov.in లో ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి సిక్స్‌ స్టెప్‌ వెరిఫికేషన్‌ పొందిన తర్వాత రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని సంబంధిత హాల్‌ టికెట్లు ఈ నెల 22 నుంచి 25వ తేదీలోగా ఆ వెబ్‌ సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 27వ తేదీన స్క్రీనింగ్‌ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కార్యాలయంలో ప్రత్యేక పూజలు

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్ల ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శనివారం విజయ దశమి పూజలు నిర్వహించారు. వాహ న, ఆయుధ పూజలు నిర్వహించారు. పూజల్లో భక్తిశ్రద్ధలతో పోలీస్‌ అధికారులు, సిబ్బంది పా ల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, అందరూ సుఖ శాంతులతో ఉండాలని, క్రమ శిక్షణతో విధులు నిర్వహించి పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకు రావాలని ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్పీలు రాజశేఖర్‌, ఎల్‌.శేషాద్రి నాయుడు, సీఐ టి.ఇమ్మూన్యుయ ల్‌ రాజు, ఆర్‌ఐ నర్సింగరావు పాల్గొన్నారు.

దేవీ నవరాత్రుల ముగింపు

శ్రీకాకుళం కల్చరల్‌: దేవీ నవరాత్రులు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో అమ్మవారిని ఆఖరి అవతారంగా రాజరాజేశ్వరీ దేవిగా అలంకరించారు. దసరా సందర్బంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు వెళ్లి దర్శించుకున్నారు. ఆలయాల వద్ద నూతనంగా కొనుగోలు చేసిన వాహనాలకు పూజలు చేశారు. నిత్యం వాడే వాహనాలకు కూడా పూజలు చేయించుకున్నారు.

ఘనంగా ఆదిత్యుని కల్యాణం

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి పర్వ దినం సందర్భంగా శ్రీ ఉషా పద్మిని చాయా సమేతుడైన సూర్యనారాయణస్వామి ఉత్సవ మూర్తులకు ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణాన్ని అర్చకులు వేదమాంత్రోచ్ఛరణల మధ్య జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్‌శర్మ కార్యక్రమాన్ని జరిపించగా రూ.500 చెల్లించిన దంపతులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.

జీతాల కోసం వినతి

కాశీబుగ్గ: పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్‌ యూనిట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, వైద్య సిబ్బంది ఆదివారం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును నిమ్మాడలో కలిశారు. గత పన్నెండు నెలలుగా జీతాలు రాక కుటుంబాలతో ఇబ్బందులు పడుతున్నామని, ఆదుకోవాలని కోరారు. అనంతరం రాతపూర్వకంగా వినతి పత్రాన్ని అందించారు. వినతి పత్రం అందించిన వారిలో మనీషా, సంధ్యారాణి, స్వామి, వేణు తదితరులు ఉన్నారు.

డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ 1
1/2

డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ 2
2/2

డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement