కూన రవి శారీరకంగా.. మానసికంగా వేధించాడు: ప్రిన్సిపాల్‌ సౌమ్య | TDP MLA Kuna Ravi Kumar Harassment Allegations: KVGB Principal Soumya Demands Judicial Inquiry | Sakshi
Sakshi News home page

కూన రవి శారీరకంగా.. మానసికంగా వేధించాడు: ప్రిన్సిపాల్‌ సౌమ్య

Aug 23 2025 2:49 PM | Updated on Aug 23 2025 4:25 PM

Kgbv Principal Soumya Comments On Tdp Mla Kuna Ravikumar

సాక్షి, శ్రీకాకుళం:  టీడీపీ ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని కేజీబీవీ ప్రిన్సిపాల్‌ రెజిటీ సౌమ్య తెలిపారు. శనివారం ఆమె మీడియా ముందుకు వచ్చారు.  కూన రవి వేధింపులకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యే వేధింపులపై సిటింగ్ జడ్జితో ఎంక్వయిరీ చేయించాలని సౌమ్య డిమాండ్‌ చేశారు. 2013 నుంచి ప్రిన్సిపాల్‌గా తాను పనిచేస్తున్నానని ఇంతవరకు తనపై ఎలాంటి రిమార్క్ లేదన్నారు.

‘‘రెండు నెలులుగా వేధింపులకు గురవుతున్నా.. వేధింపుల్లో భాగంగానే నన్ను బదిలీ చేశారు. ఎంత మానసిక ఒత్తిడి లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాను. నేను సాధారణ మహిళను.. నాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే నాపై చేసిన ఆరోపణలపై విచారణ చేయించాలి. ఎంక్వయిరీ చేయకుండా ఎలా నాపై ఆరోపణలు చేస్తారు?’’ అంటూ సౌమ్య ప్రశ్నించారు.

‘‘నేను ఎలాంటి తప్పు చేయలేదు కనుకే విచారణ చేయించాలని ధైర్యంగా చెప్తున్నా. స్కూల్‌కు నేను సరిగా వెళ్ళననని ఎమ్మెల్యే కూన రవికుమార్ అబద్ధం చెబుతున్నారు. నా స్కూల్ అటెండెన్స్ సీఎస్‌ఈ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేశానుఅదికూడా చూడండి. ప్రతీ రోజు పెట్టే ఫుడ్ కూడా మెనూ ప్రకారం పెడుతున్నా.. అది ప్రతి రోజు ఫొటోలు కూడా మాపై అధికారులకు పెట్టాను. పేరెంట్స్ నుంచి డబ్బులు వసూలు చేశానని నాపై ఎమ్మెల్యే తప్పుడు ఆరోపణలు చేయించారు. ఇంతవరకు నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి డబ్బులు తీసుకోలేదు. ఎస్ఎంసీ చైర్మన్ పరం నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు స్కూల్‌కి వచ్చి క్లాస్ రూమ్‌ల్లోకి వెళ్ళి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు.

..ఎమ్మెల్యే నా ప్రొఫెషనల్ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలపై తప్పుడు ఆరోపణలు చేశారు. నా వివాహం గురించి కూడా తప్పుగా మాట్లాడారు. నా భర్త వేరే మహిళను పెళ్లి చేసుకోవడానికి నన్ను మోసం చేశారు. అతను ఇప్పుడు వేరే మహిళను పెళ్లి కూడా చేసుకున్నారు. రాత్రిపూట ఒక ఎమ్మెల్యే మహిళలకు వీడియో కాల్ చేయాల్సిన అవసరం ఏంటి?. పొందూరులో ఓసారి రాత్రి 10 గంటల వరకు కూడా ఎమ్మెల్యే మీటింగ్ పెట్టారు. నా సర్వీస్‌లో ఇంతవరకు ఎలాంటి తప్పు చేయలేదు ఈ రెండు నెలల నుంచే నేను వేధింపులకు గురవుతున్నా. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడినా నాకు న్యాయం జరగలేదు. ఇంతవరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు.

నాకు నటించాల్సిన అవసరం లేదు కూన రవికుమార్ బండారం బయటపెట్టిన సౌమ్య

..కొన్ని కేజీబీవీ పాఠశాలల్లో అవినీతి అక్రమాలు జరిగాయి. అక్కడ పని చేస్తున్న వారు ఎమ్మెల్యే కూన రవికుమార్ సొంత సామాజిక వర్గం కావడంతో వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా నేను స్కూల్‌కు వెళ్లాను. సెలవు రోజుల్లో (శనివారం రక్షా బంధన్) నాకు ట్రాన్స్‌ఫర్‌ లెటర్ పెట్టారు...rjd  ఆర్‌ఐడీ విచారణ జరగకుండా నన్ను ఎందుకు బదిలీ చేశారు. నన్ను సపోర్ట్ చేసిన వారిపై దాడులు కూడా చేస్తున్నారు. ఆ రోజు కూడా ఎమ్మెల్యేకి రాత్రి కదా వీడియో కాల్ వద్దు.. ఆడియో కాల్ చేయమని అడిగాను. లేదు వీడియో కాల్‌లోకి రావాలని ఒత్తిడి చేశారు. నా కులం విషయంలో కూడా ఎమ్మెల్యే కార్యాలయంలో రవి కుమార్ నన్ను దూషించారు

..సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్‌ స్పందించి నాకు న్యాయం చేయాలి. ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. కానీ నేను దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. నాకు జరిగిన అన్యాయంపై మాత్రమే మాట్లాడాను.గ  వేధింపులపై జిల్లా కలెక్టర్‌కు గతంలో ఫిర్యాదు చేశాను. కలెక్టర్‌ను ఎమ్మెల్యే ఒత్తిడి చేయడంతో నన్ను ట్రాన్స్‌ఫర్‌ చేశారు’’ అని సౌమ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement