ఆర్మీ సుబేదార్ మేజర్ మృతి
నరసన్నపేట: నరసన్నపేట మండలం కామేశ్వరిపేటకు చెందిన పతివాడ భూషణరావు (46)జమ్మూ కాశ్మీర్‌లోని లే సెక్టార్‌లో సుబేదార్ మేజర్‌గా పనిచేస్తూ శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం చేరింది. 25 ఏళ్లుగా ఆర్మీలో వివిధ కేడర్స్‌లో పనిచేస్తున్న భూషణరావుకు తల్లిదండ్రులు అప్పన్న, రాధ, భార్య సుజాత, పిల్లలు బిందు, శశి ఉన్నారు. సోమవారం గ్రామానికి మృతదేహం వచ్చే అవకాశం ఉంది. భూషణరావు మృతి పట్ల పోలాకి జెడ్‌పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణచైతన్య, వైఎస్సార్ సీపీ నాయకులు వాకముళ్లు చక్రధర్, కోట జోగినాయుడు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.


