అంబరాన్నంటిన జానపద సంబరాలు
మందస : హరిపురంలో గిడుగు రామ్మూర్తి తెలుగు భాష జానపద కళా పీఠం, బైకులు పోలమ్మ యువజన సంఘం, సోమేశ్వరరావు కలాసీల సంఘం ఆధ్వర్యంలో బద్రి కూర్మారావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన జానపద కళా జాత ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. జముకులపాట, ఎరుకుల పాట, జంగం పాట, తుడుం సన్నాయి మేళం, గంగిరెద్దుల పాటలు, తప్పెటగుళ్లు, థింసా వంటి కళా ప్రదర్శనలు అలరించాయి. కుమార్‌నాయక్ బృందం ప్రదర్శించిన ఒరియా జానపద ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. నిహారిక సుదర్శన్‌ల కూచిపూడి, మహిళల కోలాటం, బాలక లోకనాథం బుర్రకథ, ఈశ్రర పాత్ర మిమిక్రీ, గాయకులు మద్దిల నారాయణ, బాడ సూరన్న, అమ్మ రామకృష్ణ, సాలిన జోగారావులు ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో డాక్టర్ మట్ట ఖగేశ్వరరావు, దున్న సోమేశ్వరరావు, నల్ల జయశంకర్, మడ్డు తిరుపతిరావు, రాపాక సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అంబరాన్నంటిన జానపద సంబరాలు


