సౌమ్య రేప్ కేసులో ఉరిశిక్ష రద్దు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేరళ యువతి సౌమ్యపై అత్యాచారం, హత్య కేసులో దోషి గోవిందాచామికి కింది కోర్టు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అతనిపై హత్య ఆరోపణల్ని కొట్టివేసిన కోర్టు... అత్యాచారం కేసులో జీవిత ఖైదును కొనసాగిస్తూ తీర్పునిచ్చింది. పాత కేసులో జీవిత ఖైదుతోపాటు తాజాగా ఏడేళ్ల జైలు శిక్ష ఒకేసారి అమలవుతాయని పేర్కొంది.
2011 ఫిబ్రవరి 1న ఎర్నాకుళం–షోరానూర్ ప్యాసింజర్ రైల్లోని మహిళా కోచ్‌లో ప్రయాణిస్తున్న 23 ఏళ్ల సౌమ్యపై గోవిందాచామి దాడిచేసి రైలునుంచి తోసేశాడు. అనంతరం రైలు నుంచి దూకిన అతను .. సౌమ్యను ట్రాక్ సమీపానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తీవ్రంగా గాయపడ్డ సౌమ్యSచికిత్స పొందుతూ మరణించింది.