అసోం సీఎస్‌గా సిక్కోలు వాసి | Ravi Kota Appointed As Next Chief Secretary Of Assam - Sakshi
Sakshi News home page

అసోం సీఎస్‌గా సిక్కోలు వాసి

Jan 18 2024 1:12 AM | Updated on Jan 18 2024 1:14 PM

- - Sakshi

శ్రీకాకుళం: సిక్కోలు వాసికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది అసోం ప్రభుత్వం సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్‌ అధికారి కోత రవి అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. అస్సాం కేడర్‌ 1993 బ్యాచ్‌కు చెందిన రవి.. గతంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో ఆర్థిక దౌత్యాధికారిగా పనిచేశారు.

ప్రస్తుతం అస్సాం ప్రభుత్వంలో 18 శాఖలకు అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఉల్ఫా తీవ్రవాదులతో జరిగిన శాంతి ఒప్పందంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. రవి పనితీరును గుర్తించిన అసోం ప్రభుత్వం ఆయనకు కీలక పదవిని అప్పగించింది. ఈ నియామకంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలఖారులో రవి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. 

 

Advertisement
 
Advertisement
Advertisement