టెక్కలి: ఇటీవల రైలు ఢీకొని మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ నిరుద్యోగ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు టి.సూర్యం కోరారు. సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో పాటు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. అనంతరం మృతి చెందిన విద్యార్థులకు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందజేయాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత చైతన్య వేదిక అధ్యక్షుడు బి.గోవిందరావు, జి.శ్రీనివాస్, ఎల్.రామచంద్రుడు, కె.జగ్గారావు, జె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


