అగ్నిమాపక కేంద్రం నూతన భవనం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అగ్నిమాపక కేంద్రం నూతన భవనం ప్రారంభం

Sep 29 2026 1:09 AM | Updated on Sep 29 2026 1:09 AM

సోంపేట: పట్టణంలోని అగ్నిమాపక కేంద్రానికి నూతనంగా నిర్మించిన భవనాన్ని జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహనరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోం మంత్రి వి.అనిత విజయనగరం జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయం నుంచి సోంపేట అగ్నిమాపక కేంద్రం నూతన భవనాన్ని వర్చువల్‌గా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణం పూర్తి కావడంతో సిబ్బందికి ఇబ్బందులు తప్పాయన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు సోంపేట అగ్నిమాపక శాఖ సిబ్బంది పూర్తిస్థాయి సేవలు అందిస్తున్నారని తెలిపారు. పలాస, సోంపేట అగ్నిమాపక శాఖాధికారులు సోమేశ్వరరావు, సూర్యారావు, సోంపేట, ఇచ్ఛాపురం, పలాస అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement