అనారోగ్యంతో కానిస్టేబుల్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో కానిస్టేబుల్‌ మృతి

Sep 29 2026 1:09 AM | Updated on Sep 29 2026 1:09 AM

ఎచ్చెర్ల/ఆమదాలవలస: ఎచ్చెర్ల పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బగాది తవిటినాయుడు (40) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆమదాలవలస మండలం పూజారిపేట గ్రామానికి చెందిన ఈయన 2009 బ్యాచ్‌ ద్వారా కానిస్టేబుల్‌గా ఎంపికై పలు స్టేషన్లలో పనిచేశారు. ఈయన గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతూ.. శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల పోలీసులు ఆయన స్వగ్రామంలో సోమవారం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement