పింఛన్‌ దారుల సమస్యల పరిష్కారానికి సమావేశం | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ దారుల సమస్యల పరిష్కారానికి సమావేశం

Nov 10 2023 4:52 AM | Updated on Nov 10 2023 4:52 AM

పాతపట్నంలో అగ్నికి దగ్ధమైన పాన్‌షాప్‌   
 - Sakshi

పాతపట్నంలో అగ్నికి దగ్ధమైన పాన్‌షాప్‌

శ్రీకాకుళం పాత బస్టాండ్‌: పింఛన్‌దారుల సమస్యల పరిష్కారం కోసం కో ఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించనున్నట్లు ఖజానా శాఖ డీడీ సీహెచ్‌ రవికుమార్‌ తెలిపారు. ఈ నెల 14వ తేదీన పింఛనుదారుల సమస్యలపై పింఛన్‌దారులు, పింఛన్‌ దారుల సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశం జిల్లా ఖజానా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరుగుతుందని తెలిపారు. పింఛను దారులు వారి సమస్యలు విన్నవించుకోవాలని సూచించారు.

పాన్‌షాపు దగ్ధం

పాతపట్నం: పాతపట్నం ఆల్‌ఆంధ్ర రోడ్డు సమీపంలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో కె.మోహనరావుకు చెందిన పాన్‌షాప్‌ అగ్నికి ఆహుతైపోయింది. గురువారం రాత్రి 8 గంటల సమయంలో మోహనరావు షాపు మూసివేసి, ఇంటికి వెళ్లిపోయారు. 8.30 సమయంలో షాప్‌ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో ఇరుగుపొరుగువారు మోహనరావుకు తెలియజేసి, మంటలను అదుపుచేశారు. ఆస్తి నష్టం రూ.50 వేలు ఉంటుందని అంటున్నారు. ఫ్రిజ్‌తో పాటు దుకాణంలోని వస్తువులు కాలిపోయాయి. సంఘటన స్థలానికి వీఆర్‌ఓ రోజా రమణి చేరుకుని, బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement