బిక్కుబిక్కుమంటూ విధులు | - | Sakshi
Sakshi News home page

బిక్కుబిక్కుమంటూ విధులు

Sep 28 2026 12:59 AM | Updated on Sep 28 2026 12:59 AM

పోరాటం ఆపేది లేదు

కదిరి అర్బన్‌: గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల భద్రత కోసం సర్క్యులర్‌ 1–19ని జారీ చేసింది. దీంతో ఉద్యోగులు మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో విధులు నిర్వహించేవారు. సంస్థ ఆదాయం కూడా పెంచేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ సర్క్యులర్‌ను అటకెక్కించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కార్మికులు ఉద్యమ బాట పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. కదిరి డిపోలో డీఎం రమణయ్య సదరు సర్క్యులర్‌ను అమలు చేయనందుకు నిరసనగా ఈ నెల 25 నుంచి నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ ఉద్యోగులు డిపో గ్యారేజీల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు సార్లు ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ నెల 27న (ఆదివారం) డిపోలో పెద్ద ఎత్తున గేట్‌మీట్‌, ధర్నా నిర్వహించారు.

వీధిన పడిన ఉద్యోగులు..

జిల్లాలో మొత్తం 6 డిపోలు ఉన్నాయి. ఇందులో ఆర్టీసీ, అద్దె బస్సులు కలిపి 338 ఉన్నాయి. 1,200 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 1–19 సర్క్యులర్‌ అమలు కాకపోవడంతో ఇప్పటివరకు 50 మంది ఉద్యోగులు (డ్రైవర్లు, కండక్టర్లు) సర్వీస్‌ నుంచి రిమూవల్‌ అయినట్లు తెలుస్తోంది. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

సర్క్యులర్‌ ఏం చెబుతోందంటే?

ఏపీఎస్‌ఆర్టీసీలో 1963లో ఏర్పాటు చేసుకున్న కాండక్ట్‌, క్లాసిఫికేషన్‌, అప్పీల్‌ ప్రకారం ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగుల చిన్న చిన్న తప్పులకూ పెద్ద శిక్ష వేసేవారు. ప్రయాణికుడు టికెట్టు తీసుకోకుండా ప్రయాణం చేసినట్లు తనిఖీ అధికారి కనుగొన్న పక్షంలో కండక్టరును ఉద్యోగం నుంచి తొలగించేవారు. అలాగే డ్రైవర్‌ ప్రమేయం లేని యాక్సిడెంట్‌ కేసుల్లో డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించేవారు. ఈ పద్ధతులన్నీ 2019 వరకు అమలయ్యేవి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే తొలుత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. 52,000 మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన ఘనత ఆయనదే. అప్పటి ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ఉద్దేశంతో సంస్థలో పని చేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు,మెకానిక్‌లు,అసిస్టెంట్‌ మేనేజర్‌ ర్యాంక్‌ వరకు విధి విధానాలను యూనియన్‌ నాయకులతో సంప్రదించి సర్క్యులర్‌ నంబర్‌ 1–19ను తీసుకువచ్చింది. దీంతో ఉద్యోగులు భయం లేకుండా ఉద్యోగాలు చేశారు. సంస్థ కూడా అభివృద్ధి బాటలో నడి చింది. ఎలాంటి కేసులైనా సస్పెన్షన్‌ లేకుండా చేసి ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపారు.

కదిరి డిపోలో అమలు కాని

సర్క్యులర్‌ 1–19

ఇష్టారాజ్యంగా ఉద్యోగాలు తొలగిస్తున్నారని ఉద్యోగుల ఆవేదన

ఉద్యోగులకు శాపం..

కదిరి డిపోలో పనిచేస్తున్న మౌలాసాబ్‌ అనే కండక్టర్‌ 40 కలెక్టడ్‌ కేసుకు సంబంధించి రిమూవల్‌ ఫ్రం సర్వీస్‌ చేశారు. సోమశేఖర్‌ అనే డ్రైవర్‌ను సస్పెండ్‌ చేశారు. ఇటీవల డ్రైవర్‌ భాస్కర్‌రెడ్డిని యాక్సిడెంట్‌ కేసులో సస్పెండ్‌ చేశారు. ఇలాంటి తీవ్రమైన శిక్షలు ఆపి ఉద్యోగుల్లో భద్రతాభావం కల్పించాలని ఎన్‌ఎంయూ ఉద్యమబాట పట్టింది. కదిరి డిపోలో డ్రైవర్లను నిష్కారణంగా రిమూవల్‌ చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిపో, డిపో నడుమ అంతరాలు పెడుతున్నారని చెబుతున్నారు.

సర్క్యులర్‌ అమలు చేస్తున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement