కొనసాగుతున్న వివక్ష | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న వివక్ష

Sep 28 2026 12:59 AM | Updated on Sep 28 2026 12:59 AM

అనంతపురం కల్చరల్‌: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాహిత్య పురస్కారాలలో రాయలసీమ వాసులను, ముఖ్యంగా జిల్లా కవులను, రచయితలను క్రమంగా పక్కన పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన మహాకవి జాషువా పురస్కారాల ప్రకటనలో ఈ విషయం తేటతెల్లమైంది. మరో ‘సారీ’ అనంత వాసులను విస్మరిస్తూ, వివక్ష చూపుతూ కేవలం కోస్తా జిల్లాల నుంచి పలువురిని ఎంపిక చేసింది. సాహిత్య సేవలో అనేక మంది ‘అనంత’ సాహితీవేత్తలు, కవులు, రచయితలు తమదైన కృషి సాగిస్తూ రాష్ట్రస్థాయి గుర్తింపు పొందారు. ప్రతి సందర్భంలో సాహితీ సమావేశాలు, సదస్సులు క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటారు. సుప్రసిద్ధ కావ్యాలు, ప్రబంధాలు, కవితా సంపుటాలు, భాషా గ్రంథాలు ఈ గడ్డపై నుంచే వచ్చాయి. మహాకవి జాషువా పద్య సాహిత్యంపై ఉమ్మడి అనంత జిల్లా సాహితీవేత్తలు విస్తృత ప్రచారం గావిస్తున్నారు. ‘జాషువా సాహిత్య పీఠం’ ఏర్పాటు చేసుకుని ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తుంటారు. జాషువా విగ్రహాన్ని నగరం నడిబొడ్డును ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా జాతీయస్థాయి గుర్తింపు వచ్చినా ఇక్కడి వారిని ప్రభుత్వం గుర్తించడంలో విఫలమవుతోంది.

పూర్తి నిర్లక్ష్యం..

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో అనేక మందికి కందుకూరి అవార్డులు, ఉగాది పురస్కారాలు, కళారత్న పురస్కారాలు, భాషా పురస్కారాలు, బోయి భీమన్న అవార్డులు ప్రకటించింది. ప్రతిసారి ‘సీమ’ రచయితల పట్ల పూర్తి వివక్ష, విస్మరణతో మొండి చెయ్యి చూపింది. దేనిలోనూ ఉమ్మడి అనంత జిల్లాలకు స్థానం కల్పించలేదు. రాయలసీమకు చెందిన వారే అధికారంలో ఉన్నా ప్రతిసారి అన్యాయమే జరుగుతోందంటూ ఎంతో మంది సాహితీవేత్తలు వాపోతున్నారు. ప్రతి నలుగురు కలిసే చోట ఇదే ప్రస్తావన చేసుకుంటున్నారు. ఇంకెన్నాళ్లు ఈ వివక్ష కొనసాగుతుందోనంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. అవార్డులన్నీ రూ.లక్షల నగదు బహుమతితో కూడుకున్నవి కావడంతో లాబీ యింగ్‌ చేస్తున్న వారు మాత్రమే అర్హులుగా ఉన్నారని కవులు ఆరోపిస్తున్నారు.

సాహిత్య అవార్డుల్లో మరోసారి ‘సీమ’ వాసులకు రిక్తహస్తం

తీరు మారని చంద్రబాబు ప్రభుత్వంపై

జిల్లావాసుల మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement