చిలమత్తూరు: మండల పరిధిలోని థామస్ మన్రో తోపులోని కోడూరు పీహెచ్‌సీ వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పీహెచ్‌సీలో వైద్యులు సక్రమంగా అందుబాటులో ఉండకపోగా, అందుబాటులో ఉన్న సిబ్బంది కాలం చెల్లిన మందులను రోగులకు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
వాడిన ఐవీ సెట్లు...
కాలం చెల్లిన మందులు..
కోడూరు పీహెచ్‌సీ వైద్యం అస్తవ్యస్తంగా మారింది. వాడిన ఐవీ సెట్లు మరొక రోగికీ వాడుతున్నారన్న విమర్శలున్నాయి. ఇందుకు బలం చేకూర్చేలా పీహెచ్‌సీలో వాడిన ఐవీ సెట్‌లను పడేయకుండా అక్కడే ఉంచడం కలకలం రేపుతోంది. వాడిన ఐవీ సెట్లు వాడటం మూలాన ప్రాణాంతక ఇన్పెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిసినా వైద్య సిబ్బంది వాటినే వినియోగించడంపై కలకలం రేపుతోంది. అలాగే ఐవీ సెట్లు ప్రైవేటుగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. కొందరు సిబ్బంది వాటిని బయట విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారనే చర్చ సాగుతోంది. వైద్యం కోసం వచ్చే రోగులకు అందించాల్సిన మందులు కాలం చెల్లినవి, అపరిశుభ్రంగా ఉన్నవి పంపిణీ చేస్తున్నారంటున్నారు. పీహెచ్‌సీలో వైద్యులు ఇద్దరు ఉండగా, ఒక్కరే విధిగా హాజరవుతుండగా, మరొక వైద్యుడు డా. నికేష్ పుట్టపర్తిలో నివాసం ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి.
కోడూరు పీహెచ్‌సీలో కాలం చెల్లిన
మందులు, వాడిన ఐవీ సెట్‌ల వాడకం?
ఐవీ సెట్లు ప్రైవేటుగా విక్రయిస్తున్న వైనం !


