కేజీబీవీల్లో వనరుల నిర్వహణకు ‘ఈఆర్‌పీ’ | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీల్లో వనరుల నిర్వహణకు ‘ఈఆర్‌పీ’

Sep 26 2026 12:38 AM | Updated on Sep 26 2026 12:38 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్‌పీ) విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కేజీబీవీల సెక్రటరీ దేవానందరెడ్డి సూచించారు. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న కేజీబీవీ ప్రిన్సిపాల్స్‌, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్స్‌, వార్డెన్లకు శుక్రవారం ఈఆర్‌పీ, నాణ్యమైన భోజనం, విద్యార్థుల విద్యా ప్రగతిపై స్థానిక సైన్స్‌ సెంటర్‌లో అవగాహన శిక్షణ నిర్వహించారు. కేజీబీవీలకు అవసరమైన నిత్యావసర సరుకులు, ప్రొవిజన్స్‌, ఇతర సామగ్రి అవసరాలను ముందుగానే అంచనా వేసి.. వాటి సరఫరా, నిల్వ, వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించే విధానంపై శిక్షణ ఇచ్చారు. సరఫరా అయ్యే సరుకుల నాణ్యత, పరిమాణం, వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

భోజన నాణ్యతపై పర్యవేక్షణ..

కేజీబీవీల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని దేవానందరెడ్డి సూచించారు. నిర్ణీత ప్రమాణాల మేరకు పౌష్టికాహారం అందేలా చూడాలని, ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ, వంటశాల పరిశుభ్రత, భోజన తయారీ, పంపిణీ ప్రక్రియలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు.

కేజీబీవీల సెక్రటరీ దేవానందరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement