పుట్టపర్తి టౌన్: ఆర్టీసీ సంస్థలో ఖాళీగా ఉన్న 15 వేల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ఏపీ పీడీటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పుట్టపర్తి పట్టణంలో అబ్దుల్ కలాం పంక్షన్ హాల్‌లో జిల్లా పీడీటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా విస్తృత స్థాయి కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు జీవైపీ రావు, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఏపీ పీడీటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అవసరమైన ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందినే నియమించాలన్నారు. ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా ప్రభుత్వం ముందుకు వెళ్తే యూనియన్ల ద్వారా ఉద్యమం చేపడతామన్నారు. విధి నిర్వహణలో ఆర్టీసీ సిబ్బంది పై దాడులను పాల్పడితే వారిపై నాన్ బెయిల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 400 మంది ఉద్యోగులు పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే పదోన్నతులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఈయూ రాష్ట్ర కార్యదర్శి నబీరసూల్, జోనల్ కార్యదర్శి రాజశేఖర్, అధ్యక్షులు సిఎస్ ఖాన్, ఆర్గనైజింగ్ కార్యరద్శి నాగార్జునరెడ్డి, నాయకులు బాబయ్య, అరుణమ్మ, రమణప్ప, నరశింహులు, ఆదినారాయణ, శంకరప్ప, వెంకటేష్, లక్ష్మీకాంతమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


