ఆదివారమూ బ్యాంకులు పనిచేస్తాయి | - | Sakshi
Sakshi News home page

ఆదివారమూ బ్యాంకులు పనిచేస్తాయి

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

● 28 నుంచి 30 వరకూ

బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ప్రశాంతి నిలయం: తమ డిమాండ్ల సాధనకు బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 28వ తేదీ నుంచి మూడురోజుల పాటు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఈనెల 27న ఆదివారం బ్యాంక్‌ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ ఫణీంద్ర కుమార్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 26న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుందని, అలాగే యునైటెడ్‌ ఫోరం బ్యాంక్‌ యూనియన్స్‌ పిలుపు మేరకు ఈనెల 28 నుండీ 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వరంగ, గ్రామీణ, సహకార బ్యాంకులు మూతపడనున్నాయన్నారు. అందువల్ల ఖాతాదారులు ఇబ్బందులు పడకుండా 27న ఆదివారం సాధారణ పనివేళల్లో బ్యాంక్‌ సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామని ఎల్‌డీఎం పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాదారులు ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకుని ఆర్థిక అవసరాలకు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెలవు, బ్యాంకు ఉద్యోగుల సమ్మె రోజుల్లోనూ ఏటీఎంలు, కాల్‌సెంటర్లు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ పనిచేస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement