‘జిల్లా పరిషత్‌’ తాత్కాలిక భవనం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘జిల్లా పరిషత్‌’ తాత్కాలిక భవనం ప్రారంభం

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

● జెడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు

స్వీకరించిన కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

పుట్టపర్తి టౌన్‌: జిల్లా పరిషత్‌ కోసం కొత్తచెరువులో నూతనంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక భవనాన్ని బీసీ సంక్షేమ, జౌళిశాఖ మంత్రి సవిత, కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రారంభించారు. అనంతరం తాత్కాలిక భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల చాంబర్లు, కాన్ఫెరెన్స్‌ హాలు, ప్రజాప్రతినిధుల సమావేశ మందిరాలను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్‌ వ్యవస్థను బలోపేతం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యం, ఉపాధి హామీ పర్యవేక్షణను మరింత సమర్ధవంతంగా అమలు చేయడానికి జిల్లా పరిషత్‌ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధికారులు అనువైన వాతావరణంలో సేవలందించేందుకు జిల్లా పరిషత్‌కు తాత్కాలిక భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అనంతరం ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, జిల్లా పరిషత్‌ ప్రధాన కార్యనిర్వహణ అధికారి విజయలక్ష్మి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్‌ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ జెడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. జెడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు తీసుకున్న కలెక్టర్‌కు ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఆరు మండలాల్లో

తుంపర వర్షం

పుట్టపర్తి అర్బన్‌: వాయుగుండం ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో తుంపర వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ 6 మండలాల పరిధిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రొద్దం మండలంలో 14.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తలుపుల మండలంలో 10.2 మి.మీ, ముదిగుబ్బ 3.2, ధర్మవరం 2.6, తాడిమర్రి 1.2, పెనుకొండ మండలంలో 1.0 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement