జగనన్న చలువతోనే సేవా భాగ్యం | - | Sakshi
Sakshi News home page

జగనన్న చలువతోనే సేవా భాగ్యం

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

● ఆత్మీయ వీడ్కోలు సభలో జెడ్పీటీసీ సభ్యులు

అనంతపురం న్యూటౌన్‌: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చలువతోనే ప్రజలకు సేవ చేసే మహదవకాశం తమకు దక్కిందని పలువురు జెడ్పీటీసీలు పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ పాలకమండలి పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గురువారం సభ్యులకు స్థానిక జెడ్పీ సమావేశ భవనంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌హన్‌ రెడ్డికి రుణపడి ఉంటామన్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూ.129.53 కోట్ల మేర పనులు చేపట్టినట్లు వెల్లడించారు. రూ.39.14 కోట్లతో రోడ్లు, రూ. 64.64 కోట్లతో తాగునీటి సౌకర్యం, రూ.11.18 కోట్లతో డ్రైనేజీలు, రూ. 5.79 కోట్లతో కల్వర్టులు, రూ.59 లక్షలతో అంగన్‌వాడీ భవనాల నిర్మాణం జరిగిందన్నారు. 180 కారుణ్య నియామకాలు చేపట్టామన్నారు. 32 మంది ఎంపీడీఓలు, 48 మంది డిప్యూటీ ఎంపీడీఓలు, 42 మంది ఏఓలు, 112 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 12 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు డ్రైవర్లు, 53 మంది లేబర్‌ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించినట్లు తెలిపారు. ఆత్మీయ సభలో జెడ్పీటీసీలతోపాటు సీఈఓ విజయలక్ష్మి, డిప్యూటీ చైర్‌పర్సన్‌ నాగరత్నమ్మ, పరిపాలన అధికారులు మాధవి, లెక్కల శ్రీనివాసులు, నందకిషోర్‌, చైర్‌పర్సన్‌ సీసీలు సురేష్‌, నరేష్‌ తమ అనుభవాలు పంచుకున్నారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యులను అధికారులు సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement