మహిళల వల్లే నరసంబూదికి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

మహిళల వల్లే నరసంబూదికి గుర్తింపు

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

అగళి: మహిళల వల్లే నరసంబూది గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని పంచాయతీ రాజ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మల్లీశ్వరి అన్నారు. గురువారం ఆమె గ్రామంలో పర్యటించారు. నరసంబూది మహిళా స్నేహ పూర్వక పంచాయతీగా రాష్ట్రం నుంచి ఎంపికై న నేపథ్యంలో ఆమె గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించడంతో పాటు గ్రామంలో మౌలిక వసతులను స్వయంగా చూశారు. మహిళల జీవనోపాధి మార్గాలు, ఆదాయ వనరుల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్థానిక మహిళలు చేపడుతున్న పనులు, స్వయం ఉపాధి అవకాశాలను నేరుగా పరిశీలించి వారిని అభినందించారు. అనంతరం జాతీయ మహిళ ఫ్రెండ్లీ ప్రోగ్రాం, గ్రామ సభ నిర్వహణపై చర్చించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్య, వైద్యం, పారిశుద్ధ్య రంగాల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పేదరిక నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు, మహిళలు, బలహీన వర్గా అభ్యున్నతి, ప్రజల అవసరాలు గురించి చేపట్టబోయే కార్యాచరణపై చర్చించారు. ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీ కార్యక్రమం కింద అభివృద్ధి పనులకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు అందించే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో అక్టోబర్‌ మొదటి వారంలో కేంద్రం బృందం గ్రామంలో పర్యటించనున్నట్లు ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ శివనారాయణరెడ్డి, ఎంపీడీఓ గంగాధర్‌, తహసీల్దార్‌ హరికుమార్‌, డిప్యూటీ ఎంపీడీఓలు రెడ్డి ప్రకాష్‌, పద్మ, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ విజయకుమార్‌, పంచాయతీ కార్యదర్శులు పరమేష్‌, రంగనాథ్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ రాజ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మల్లీశ్వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement